News February 1, 2025
యువతిని మోసం చేసిన వరంగల్ యువకుడు

వరంగల్ జిల్లా శివనగర్కు చెందిన సాయితేజ(26) ప్రేమ పేరుతో ఓ యువతిని(21) మోసం చేశారు. HYD SRనగర్ పోలీసుల ప్రకారం.. సనత్నరగ్కు చెందిన యువతి బేగంపేటలో పనిచేస్తోంది. సాయితేజ ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో సహజీవనం చేశాడు. ఆమె గర్భవతి కావడంతో అబార్షన్ చేయించాడు. చివరికి వేరే అమ్మాయిని చేసుకుంటానని బాధితురాలికి చెప్పి వెళ్లిపోయాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News March 6, 2025
కృష్ణా జిల్లాలో 39.9 డిగ్రీల ఎండ

కృష్ణా జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఎండ మండిపోయింది. ముఖ్యంగా కంకిపాడులో 39.9 నమోదు కాగా.. బాపులపాడు, గన్నవరం, పెనమలూరులలో 39 డిగ్రీలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో ఉన్నదాని కంటే నాలుగు శాతం ఉష్ణోగ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
News March 6, 2025
జులై 3 నుంచి అమర్నాథ్ యాత్ర

కశ్మీర్లోని మహాశివుడి ప్రతిరూపమైన సహజసిద్ధ మంచులింగం ఉండే అమర్నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే యాత్ర తేదీలు విడుదలయ్యాయి. జులై 3 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్, గాందర్బల్ జిల్లాలోని బాల్టాల్ మార్గాల నుంచి ఒకేసారి యాత్ర ప్రారంభమై 38 రోజుల పాటు కొనసాగి ఆగస్టు 9తో ముగుస్తుంది. త్వరలోనే యాత్రకు వెళ్లాలనుకునే భక్తుల కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నారు.
News March 6, 2025
లోకేశ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే తాటిపర్తి ట్వీట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కంటే తక్కువ మెజారిటీ సాధించిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత లేదన్న మంత్రి లోకేశ్ వ్యాఖ్యలపై యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. అలా అయితే జగన్ మోహన్ రెడ్డి కంటే తక్కువ మెజారిటీ వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకు కూడా జగన్ను విమర్శించే అర్హత లేనట్టే కదా అన్నారు.