News February 1, 2025

యువతిని మోసం చేసిన వరంగల్ యువకుడు

image

వరంగల్ జిల్లా శివనగర్‌కు చెందిన సాయితేజ(26) ప్రేమ పేరుతో ఓ యువతిని(21) మోసం చేశారు. HYD SRనగర్ పోలీసుల ప్రకారం.. సనత్‌నరగ్‌కు చెందిన యువతి బేగంపేటలో పనిచేస్తోంది. సాయితేజ ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో సహజీవనం చేశాడు. ఆమె గర్భవతి కావడంతో అబార్షన్ చేయించాడు. చివరికి వేరే అమ్మాయిని చేసుకుంటానని బాధితురాలికి చెప్పి వెళ్లిపోయాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Similar News

News February 1, 2025

కేంద్ర బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

image

AP: కేంద్ర బడ్జెట్‌ను CM చంద్రబాబు స్వాగతించారు. వార్షికాదాయం రూ.12లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం గొప్ప పరిణామం అని చెప్పారు. PM మోదీ వికసిత్ భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్నారు. పేదలు, మహిళలు, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో వృద్ధికి 6 కీలక రంగాలను బడ్జెట్ గుర్తించిందన్నారు. ఈ సందర్భంగా కేంద్రం, ఆర్థిక మంత్రి నిర్మలకు CM అభినందనలు చెప్పారు.

News February 1, 2025

కర్నూలు జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్ బాధ్యతల స్వీకరణ

image

శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఎక్కడైనా సమస్యలుంటే తమకు తెలపాలని, వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు.

News February 1, 2025

రాష్ట్ర పోలీసు స్పోర్ట్స్ మీట్‌లో సంగారెడ్డి జిల్లాకు సిల్వర్ మెడల్

image

కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్ర పోలీసు స్పోర్ట్స్ మీట్‌లో సంగారెడ్డి జిల్లా ఐటీ కోర్ టీం గంగేరి సంతోష్ కుమార్ త్వైకాండో సిల్వర్ మెడల్ సాధించారు. కరీంనగర్‌లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1వ వరకు  నిర్వహించిన పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సిల్వర్ మెడల్ సాధించిన సంతోష్‌ను అధికారులు ప్రశంసా పత్రం, సిల్వర్ మెడల్‌ అందజేసి అభినందించారు.