News February 1, 2025

యువతిని మోసం చేసిన వరంగల్ యువకుడు

image

వరంగల్ జిల్లా శివనగర్‌కు చెందిన సాయితేజ(26) ప్రేమ పేరుతో ఓ యువతిని(21) మోసం చేశారు. HYD SRనగర్ పోలీసుల ప్రకారం.. సనత్‌నరగ్‌కు చెందిన యువతి బేగంపేటలో పనిచేస్తోంది. సాయితేజ ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో సహజీవనం చేశాడు. ఆమె గర్భవతి కావడంతో అబార్షన్ చేయించాడు. చివరికి వేరే అమ్మాయిని చేసుకుంటానని బాధితురాలికి చెప్పి వెళ్లిపోయాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Similar News

News December 4, 2025

దుగ్గిరాలలో క్వింటాల్ పసుపు ధర ఎంతంటే.!

image

దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాల్ పసుపు రూ.12,500 గరిష్ఠ ధర పలికింది. యార్డులో గురువారం నిర్వహించిన వేలంలో పసుపు కొమ్ముల ధర రూ.8,500 నుంచి రూ.12,500 పలకగా కాయ రకం పసుపు ధర రూ. 8,550 నుంచి రూ.12,500 వరకు పలికినట్లు అధికారులు తెలిపారు. రైతులు యార్డుకు తెచ్చిన పసుపు పంటలో 684 బస్తాలను వ్యాపారులకు విక్రయించారు.

News December 4, 2025

కల్వకుర్తి: కొనసాగుతున్న ఏకగ్రీవాల జోరు

image

కల్వకుర్తి నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏకగ్రీవాల జోరు కొనసాగుతుంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా నియోజకవర్గంలోని రెండు మండలాలలో ఆరు గ్రామాల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వెల్దండ మండలంలోని బండోని పల్లి, చౌదరిపల్లి, కేస్లీ తాండ, కల్వకుర్తి మండలంలోని రఘుపతిపేట, జీడిపల్లి తండా, వెంకటాపూర్ తండాల పంచాయతీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవంతో స్థానిక నాయకులు పట్టు నిలుపుకున్నారు.

News December 4, 2025

విశాఖ: రక్షణలేని ఉక్కు నిర్వాసితుల స్థలాలు

image

ఉక్కు పరిశ్రమ నిర్వాసితుల కోసం కేటాయించిన స్థలాల్లో కబ్జాదారులు చొరబడుతున్నారు. ఇటీవల గాజువాకలోని వికాస్‌ నగర్ ITI రోడ్డు వద్ద సర్వే నంబర్ 153 భూమిలో రాత్రికి రాత్రే 18 షెడ్లు నిర్మించేందుకు ప్రయత్నించగా.. అధికారులు అడ్డుకున్నారు. బీసీ రోడ్డు శివాలయం దగ్గర ఆరేళ్లుగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. చివరకు అధికారులు నిర్మాణాలను తొలగించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.