News December 25, 2024

యువతిని మోసం చేసిన వ్యక్తికి రిమాండ్: సీఐ

image

ఎస్.కోట మండలం రాజీపేటకి చెందిన వాడుబోయిన ఎర్రినాయుడు (19) పై పోక్సో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసగించాడని యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని మీద కేసు నమోదు చేశామని సీఐ మూర్తి తెలిపారు. అతడిని కాపు సోంపురం వద్ద మంగళవారం అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం విజయనగరం డీఎస్పీ వద్దకు తీసుకెళ్ళగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. 

Similar News

News January 21, 2025

జిల్లాలో నేడు పర్యటించనున్న మంత్రి అనిత

image

విజయనగరం జిల్లా ఇన్ ఛార్జి మంత్రి వంగ‌ల‌పూడి అనిత నేడు జిల్లాకు వ‌స్తున్న‌ట్టు క‌లెక్ట‌ర్ బి.ఆర్‌.అంబేడ్క‌ర్ వెల్ల‌డించారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ప‌లు శాఖ‌ల‌పై మంత్రి స‌మీక్ష నిర్వహిస్తారన్నారు. గుంత‌లు లేని ర‌హ‌దారుల కార్య‌క్ర‌మం ప్ర‌గ‌తి, ఉపాధిహామీ, పంచాయ‌తీరాజ్‌, రెవిన్యూ సద‌స్సులు త‌దిత‌ర అంశాల‌పై మంత్రి స‌మీక్షిస్తార‌ని పేర్కొన్నారు.

News January 20, 2025

డయేరియా కేసులపై మంత్రి కొండపల్లి ఆరా   

image

బొండపల్లి మండలం బిల్లలవలస డయేరియా కేసుల నమోదు ఘటనపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరా తీశారు. కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. జిల్లా వైద్యాధికారులను వెంటనే అప్రమత్తం చెయ్యాలని సూచించారు. గ్రామాన్ని సందర్శించి, వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. డయేరియా ప్రబలడానికి కారణాలు తెలుసుకొని, గ్రామంలో ఇకపై వ్యాధి విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News January 20, 2025

బొబ్బిలి: రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి

image

డోంకినవలస-బొబ్బిలి రైల్వే స్టేషన్‌ల మధ్య, గొల్లాది రైల్వే గేట్ దగ్గరలో రైల్వే ట్రాక్ మధ్యలో మహిళ మృతదేహం పడి ఉన్నట్లు రైల్వే పోలీసులు ఆదివారం తెలిపారు. సదరు మహిళ ఏదయినా గుర్తు తెలియని రైలు నుంచి జారి పడిపోవడం వల్ల గాని ఢీ కొట్టడం వల్లగాని తగిలిన గాయాలతో చనిపోయి ఉండవచ్చని తెలిపారు. విజయనగరం GRP SI V.బాలాజీరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.