News August 2, 2024
యువతిపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

యువతిపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న శివాజీ రెడ్డిని వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి యువతి(24)పై అత్యాచారం జరిగింది. ప్రధాన నిందితుడైన గౌతంరెడ్డి మంగళవారం రాత్రి అరెస్టయ్యాడు. మరో నిందితుడైన శివాజీ రెడ్డి గుంటూరుకు పారిపోయాడు. గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. శివాజీ రెడ్డి స్వగ్రామం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని ఆరెగూడెం.
Similar News
News December 1, 2025
నల్గొండ జిల్లాలో నేటి నుంచి కొత్త వైన్సులు!

జిల్లాలో కొత్త మద్యం పాలసీ నేటి నుంచి ప్రారంభం కానుంది. రెండేళ్లకాల పరిమితితో 154 మద్యం షాపులను డ్రా పద్ధతిలో కేటాయించిన విషయం తెలిసిందే. పాత షాపులకు గడువు పూర్తి కావడంతో నేటి నుంచి కొత్త మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. ఇప్పటికే 154 వైన్స్ల లైసెన్స్ పొందిన వారు షాపులు తెరిచేందుకు అనుమతి పొందారు. కొత్తగా దుకాణాలు తెరిచే వ్యాపారులు ఇప్పటికే మద్యాన్ని డంపింగ్ చేసుకున్నారు.
News December 1, 2025
నల్గొండ జిల్లాలో 1,950 సర్పంచ్ల నామినేషన్ల ఆమోదం

నల్గొండ జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఈ జిల్లా పరిధిలోని 318 సర్పంచ్ అభ్యర్థుల స్థానాలకు గాను దాఖలైన నామినేషన్లలో 1,950 మంది సర్పంచ్ నామినేషన్లు ఆమోదించామని ఎన్నికల అధికారి అమిత్ నారాయణ తెలిపారు. అదే విధంగా 2,870 వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన నామినేషన్లలో 7,893 మంది వార్డు సభ్యుల నామినేషన్లు ఆమోదించామని ఆయన వెల్లడించారు.
News December 1, 2025
బచ్చన్నగూడెం, తేలకంటిగూడెంలో సర్పంచ్ల ఏకగ్రీవ ఎన్నిక

కనగల్ మండలంలోని బచ్చన్నగూడెం, తేలకంటిగూడెం గ్రామ సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మహిళలకు రిజర్వ్ అయిన ఈ స్థానాల్లో అఖిలపక్ష నాయకుల నిర్ణయం మేరకు, కాంగ్రెస్ బలపరిచిన ఎడ్ల లిఖిత గణేష్ యాదవ్, బైరు నాగమణి నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్లతో పాటు వార్డు స్థానాలు కూడా ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు.


