News March 22, 2025

యువతిపై దాడి కేసులో ఇద్దరికి రిమాండ్ 

image

HNRలో యువతిపై దాడి చేసి శారీరకంగా కలవాలని బెదిరించి గాయపరిచిన ఘటనలో గురువారం ఇద్దరు యువకులతో పాటు, ఓ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం ఇద్దరిని రిమాండ్‌కు తరలించగా, మరొకరు పరారీలో ఉన్నట్లు హుజుర్‌నగర్ సీఐ చరమంద రాజు, ఎస్ఐ ముత్తయ్య తెలిపారు.

Similar News

News November 16, 2025

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 6

image

30. సుఖానికి ఆధారం ఏది? (జ.శీలం)
31. మనిషికి దైవిక బంధువులెవరు? (జ.భార్య/భర్త)
32. మనిషికి ఆత్మ ఎవరు? (జ.కుమారుడు)
33. మానవునకు జీవనాధారమేది? (జ.మేఘం)
34. మనిషికి దేనివల్ల సంతసించును? (జ.దానం)
35. లాభాల్లో గొప్పది ఏది? (జ.ఆరోగ్యం)
36. సుఖాల్లో గొప్పది ఏది? (జ.సంతోషం)
37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (జ.అహింస)
<<-se>>#YakshaPrashnalu<<>>

News November 16, 2025

వైసీపీపై చట్టపరమైన చర్యలు: జనసేన

image

AP: Dy.CM పవన్ కళ్యాణ్ పేషీలో లేని సురేశ్ అనే వ్యక్తి పేషీలో పనిచేస్తూ అవినీతికి పాల్పడినట్లు YCP తప్పుడు ఆరోపణలు చేసిందని జనసేన మండిపడింది. YCPపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు Xలో పోస్ట్ చేసింది. ‘పవన్ కళ్యాణ్ నిబద్ధత, పారదర్శకతపై అనుమానం కలిగించేలా నిరాధార ఆరోపణలు చేసిన వారిపై, వాటిని ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాం’ అని పేర్కొంది.

News November 16, 2025

సివిల్స్‌కు ఉచిత కోచింగ.. దరఖాస్తుల ఆహ్వానం

image

డా. బి.ఆర్. అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ద్వారా యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్-2026, మెయిన్స్‌కు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు అర్హులని ఆమె వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 340 సీట్లు ఉన్నాయన్నారు. అభ్యర్థులు నవంబర్ 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.