News March 22, 2025

యువతిపై దాడి కేసులో ఇద్దరికి రిమాండ్ 

image

HNRలో యువతిపై దాడి చేసి శారీరకంగా కలవాలని బెదిరించి గాయపరిచిన ఘటనలో గురువారం ఇద్దరు యువకులతో పాటు, ఓ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం ఇద్దరిని రిమాండ్‌కు తరలించగా, మరొకరు పరారీలో ఉన్నట్లు హుజుర్‌నగర్ సీఐ చరమంద రాజు, ఎస్ఐ ముత్తయ్య తెలిపారు.

Similar News

News April 19, 2025

ఆసిఫాబాద్ MPDO ఆఫీస్‌ను సందర్శించిన కలెక్టర్

image

రాజీవ్ యువ వికాసం పథకం కోసం వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శనివారం ఆసిఫాబాద్ MPDO కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సేవా కేంద్రాన్ని సందర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నుంచి ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం కింద అర్హులైన వారికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు చేపడుతున్న దరఖాస్తుల స్వీకరణ పారదర్శకంగా జరుగుతోందని స్పష్టం చేశారు.

News April 19, 2025

ప్రభుత్వ భూమిని ‘వసంత హోమ్స్’ ఆక్రమించింది: హైడ్రా

image

హైదరాబాద్‌ హఫీజ్‌పేట్ సర్వే నంబర్ 79లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా వివరణ ఇచ్చింది. ‘39.2 ఎకరాల్లో సగానికిపైగా ఆక్రమణలు జరిగాయి. అది ప్రభుత్వ నిషేధిత భూమిగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. సర్వే నం.79/1 పేరుతో ప్రభుత్వాన్ని ‘వసంత హోమ్స్’ తప్పుదోవ పట్టించింది. 19 ఎకరాలు ఆక్రమించి ఇళ్లు కట్టి అమ్మేశారు. ఖాళీగా ఉన్న మరో 20 ఎకరాల్లోనూ నిర్మాణాలు చేపట్టారు’ అని వివరించింది.

News April 19, 2025

KKR అసిస్టెంట్ కోచ్‌గా అభిషేక్ నాయర్

image

భారత జట్టు మాజీ సహాయక కోచ్ అభిషేక్ నాయర్ తిరిగి కేకేఆర్ జట్టుతో చేరారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘వెల్కమ్ బ్యాక్ హోమ్’ అంటూ KKR ట్వీట్ చేసింది. గతంలో అభిషేక్ KKR కోచింగ్ సిబ్బందిలో పనిచేసిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో నాయర్‌పై BCCI వేటు వేసినట్లుగా తెలుస్తోంది.

error: Content is protected !!