News February 1, 2025
యువతీ యువకులకు ఉచిత శిక్షణ

భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పుర్ గ్రామంలోని స్వామి రామానంద గ్రామీణ తీర్థ సంస్థలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వహకులు తెలిపారు. బేసిక్ కంప్యూటర్స్, సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్, సర్వీస్, కంప్యూటర్ హార్డ్వేర్, సెల్ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్, ఎలక్ట్రీషియన్పై ఆసక్తి ఉన్నవారు దరఖాస్తుచేసుకోవాలన్నారు.
Similar News
News December 4, 2025
సర్పంచులకు 147, వార్డులకు 268 నామినేషన్లు

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికల సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల పర్వం మొదలైంది. 3వ విడతలో 4 మండలాల్లోని 87 సర్పంచులు, వార్డు సభ్యులకు సంబంధించి 762 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి 29 కేంద్రాల ద్వారా నామినేషన్లను స్వీకరించారు. తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 147, వార్డు స్థానాలకు 268 నామినేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు.
News December 4, 2025
సంగారెడ్డి జిల్లాలో 6 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

సంగారెడ్డి జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 136 గ్రామ పంచాయతీలకు గాను 6 సర్పంచ్ పదవులు, 1246 వార్డులలో 113 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 130 సర్పంచ్ స్థానాలకు,1133 వార్డులకు డిసెంబర్ 11న పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు. కంది మండలంలో 1, సదాశివపేట మండలంలో 1, హత్నూర మండలంలో 4 సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
News December 4, 2025
మూడో దశ.. తొలిరోజు 141 నామినేషన్లు

జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మొదటి రోజు 141 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఐదు మండలాల్లోని 87 గ్రామ పంచాయతీలకు 141 నామినేషన్లు రాగా, 762 వార్డు స్థానాలకు కోసం 245 నామినేషన్లు అందినట్లు అధికారులు తెలిపారు. మూడో దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురు, శుక్రవారాల వరకు కొనసాగనుంది.


