News December 22, 2024
యువత జాతీయ స్థాయిలో రాణించాలి: కలెక్టర్

ఈ నెల 27న నిర్వహించే జిల్లా యువ ఉత్సవాల్లో యువత తమ ప్రతిభ పాటవాలను నిరూపించుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడలు మంత్రిత్వ శాఖ, జిల్లా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ ఉత్సవ్ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆవిష్కరించారు.
Similar News
News October 14, 2025
ఆకివీడు: రైలు నుంచి జారిపడి వృద్ధుడు మృతి

ఆకివీడు – పల్లెవాడ రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం గుర్తు తెలియని వృద్ధుడు (సుమారు 60 సం.) రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతుడిని గుర్తించిన వారు లేదా వివరాలు తెలిసిన వారు రైటర్ రాజాబాబు (9705649492) కి తెలపాలని జీఆర్పీఎఫ్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 14, 2025
భీమవరం: అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్న కార్తీక మాసం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ నాగరాణి పీజీఆర్ఎస్లో దేవాదాయ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్తీక మాసంలో దేవాలయాలు శోభాయమానంగా ఉండేలా సిద్ధం చేయాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. పేరుపాలెం బీచ్ వద్ద సముద్ర స్నానాల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
News October 13, 2025
భీమవరం: నేటి పీజీఆర్ఎస్కు 95 అర్జీలు

భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 95 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.