News March 23, 2025

యువత బెట్టింగ్‌లకు పాల్పడవద్దు: సీఐ వాసంతి

image

యువకులు బెట్టింగ్‌లకు పాల్పడి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని జీడి నెల్లూరు సీఐ శ్రీనివాసంతి శనివారం తెలిపారు. ఐపీఎల్ మోజులో పడి యువకులు బానిసలు కాకూడదన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. బెట్టింగ్ గురించి సమాచారం ఉంటే తమకు ఇవ్వాలని ఆమె కోరారు. 

Similar News

News March 30, 2025

మసీదుల వద్ద పటిష్ఠ భద్రత: చిత్తూరు జిల్లా ఎస్పీ

image

రంజాన్ సందర్భంగా ఉపవాస దీక్షలు పాటిస్తూ ముస్లిం సోదరులు సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఈద్-ఉల్-ఫితర్ పండుగను ప్రేమ, శాంతి, సౌహార్దంతో జరుపుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు కోరారు. అనంతరం మసీదుల వద్ద పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని, ప్రజలు ప్రశాంతంగా ప్రార్థనలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.

News March 30, 2025

చిత్తూరు: రేషన్ ఈ-కేవైసీకి గడువు పెంపు

image

రేషన్ కార్డులకు సంబంధించి ఈ కేవైసీ చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పెంచినట్లు డీఎస్ఓ శంకరన్  తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీలోపు రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోవచ్చని సూచించారు. ఇప్పటి వరకు 17 లక్షల మంది వరకు ఈకేవైసీ చేయించుకున్నారని, ఇంకా చేయించుకోవాల్సిన వారు 1.50 లక్షల మంది మిగిలారని వివరించారు.

News March 30, 2025

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు ఇవే

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ మాంసం కిలో. 184, స్కిన్ లెస్ మాంసం కిలో రూ. 210, లేయర్ మాంసం కిలో రూ.145 కు పలు దుకాణాలలో విక్రయిస్తున్నారు. బర్డ్ ప్లూ అనంతరం చికెన్ ధరలలో పెరుగుదల కనబడుతోంది. పండుగల కారణంగా చికెన్ ధరలు పెరిగినట్టు పలువురు తెలుపుతున్నారు. మీ ప్రాంతాలలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

error: Content is protected !!