News February 24, 2025

యువ అథ్లెటిక్స్‌లో ఆదిలాబాద్ విద్యార్థుల సత్తా

image

తెలంగాణ రాష్ట్ర యువ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీలలో ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ సైన్స్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈనెల 17, 18, 19 తేదీల్లో పోటీలు జరుగగా జిల్లా విద్యార్థులు పాల్గొని మెడల్స్ సాధించారు. ఈ నేపథ్యంలో కళాశాల ప్రిన్సిపల్ సంగీత విద్యార్థులను అభినందించారు. అరుణ, అనిల్, స్వాతి, వంశీ పలు విభాగాల్లో సిల్వర్, బ్రాంజ్ మెడల్ బహుమతులను గెలుచుకున్నారన్నారు.

Similar News

News November 19, 2025

ADB: ఆపదమిత్ర శిక్షణకు ధరఖాస్తుల ఆహ్వానం

image

విపత్తుల సమయంలో రక్షణ చర్యల్లో పాల్గొనేందుకు ఉద్దేశించిన ‘ఆపదమిత్ర’ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ, భారత్ స్కౌట్స్ గైడ్స్ చీఫ్ కమీషనర్ రాజేశ్వర్ తెలిపారు. 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయస్సు గల స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని, శిక్షణ హైదరాబాద్‌లో వారంపాటు ఉంటుందని వివరించారు.

News November 19, 2025

జైనథ్: 8 మంది దొంగల అరెస్ట్

image

ఈ నెల 14న జైనథ్‌లోని హాత్తిఘాట్ పంపుహౌస్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి గురైన రూ.4.8 లక్షల సామగ్రిని రికవరీ చేశారు. మంగళవారం 12 మందిపై కేసు నమోదు చేసి, ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. దొంగిలించిన సామగ్రి, రెండు మొబైల్ ఫోన్లు, ఒక ఆటో, రూ.7,140 నగదును స్వాధీనం చేసుకున్నారు. సామగ్రి కొనుగోలు చేసిన స్క్రాప్ దుకాణదారుడిని కూడా రిమాండ్‌కు పంపినట్లు సీఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.

News November 18, 2025

ఆదిలాబాద్‌లో రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు

image

బుధవారం నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ తలపెట్టిన బంద్‌ను విరమించుకున్న నేపథ్యంలో ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సీసీఐ, ప్రైవేటు ద్వారా పత్తి కొనుగోళ్లు యథావిధిగా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలని సూచించారు.