News December 26, 2024
యువ సమ్మేళనంలో పాల్గొంటున్న విశాఖ యువతీ, యువకులు

అంతర్ జిల్లా యువ సమ్మేళనంలో పాల్గొనేందుకు ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన నెహ్రూ యువ కేంద్రం వాలంటీర్లు బుధవారం వైఎస్ఆర్ కడప వెళ్లినట్లు NYK జిల్లా అధికారి మహేశ్వరరావు తెలిపారు. డిసెంబర్ 26 నుంచి 30వరకు ఈ యువ సమ్మేళనం జరుగుతుందన్నారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు చెందిన 25 మంది యువతీ యువకులు ఇందులో పాల్గొన్నారన్నారు. యువ సమ్మేళనాలతో వివిధ సమూహాల సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన కలుగుతుందన్నారు.
Similar News
News November 19, 2025
మద్యం మత్తులో డ్రైవింగ్.. మహిళ మృతి కేసులో కోర్టు కీలక తీర్పు

దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో వాహనం నడుపుతూ దుంగ రమణమ్మ అనే మహిళ మరణానికి కారణమైన కేసులో నిందితునికి కఠిన శిక్ష పడింది. నేరం రుజువు కావడంతో గౌరవ VIII ADJ న్యాయస్థానం నిందితుడైన పొట్నూరు త్రినాథ్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. నిందితుడికి శిక్ష పడడంలో కృషి చేసిన సిబ్బందిని పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి అభినందించారు.
News November 19, 2025
పద్మనాభంలో స్వామి ఉత్సవం ఎలా ప్రారంభమైంది?

పద్మనాభంలోని గిరి ప్రాంతంలో 1938లో విజయనగరం పాలకుడు పూసపాటి అలక్ నారాయణ గజపతి ఆనతి మేరకు ద్రాక్షారామం నుంచి వచ్చిన చేకూరి, బుల్లి సత్యనారాయణరాజు ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. త్రిపుర సుందరీదేవి విగ్రహాన్ని తీసుకువచ్చి యజ్ఞాలు నిర్వహించేవారు. ఆఖరిరోజు అనంతుని కొండ మెట్ల పంక్తికి దీపోత్సవాన్ని నిర్వహించేవారు. కొంతకాలం ఉత్సవం నిలిచినా..1987లో ఆలయ అర్చకుడు కృష్ణమాచార్యుల సూచనల మేరకు పునఃప్రారంభించారు.
News November 19, 2025
ఉత్తరాంధ్రలో అంచనాల కమిటీ పర్యటన

AP అంచనాల కమిటీ ఈనెల 25-29 వరకు ఉత్తరాంధ్రలో పర్యటించనుంది. ఛైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన కమిటీ సభ్యులు 25న విశాఖ చేరుకుంటారు. 26న సింహాచలంలో స్వామిని దర్శనం చేసుకొని.. దేవాదాయ శాఖ అధికారులతో సమావేశమౌతారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో చర్చించనున్నారు. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన పనులకు సంబంధించిన అంశాలపై సమీక్షిస్తారు.


