News February 26, 2026
యుసీఈకే ప్రిన్సిపల్‌గా ప్రొఫెసర్ కే.పద్మరాజు

యుసీఈకే ప్రిన్సిపల్‌గా ప్రొఫెసర్ కె.పద్మరాజును నియమిస్తూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ప్రిన్సిపల్‌గా పనిచేసిన డాక్టర్ ఎన్.మోహనరావును బాధ్యతల నుంచి రిలీవ్ చేసినట్లు యూనివర్సిటీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. నూతన ప్రిన్సిపల్‌గా పద్మరాజు వెంటనే బాధ్యతలు స్వీకరించనున్నారు. అపార అనుభవం ఉన్న ఆయన నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News April 14, 2026
GNT: రీ-సర్వే సమస్యల పరిష్కారానికి చర్యలు

భూముల రీ-సర్వేలో వచ్చిన లోపాలను సరిచేయడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. గురువారం రైతులకు మ్యుటేషన్, సబ్‌డివిజన్‌కు అవకాశం కల్పించారు. జూన్ 30 వరకు రాయితీ ఫీజుతో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సాధారణంగా రూ.550 ఉండే ఫీజు, గడువులో రూ. 50కే పరిమితం చేశారు. రీ-సర్వేలో ఎల్పీఎం నంబర్లు, భూమి వివరాలు తారుమారవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యల పరిష్కారానికి సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.
News April 14, 2026
పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నిన్న తగ్గిన బంగారం, వెండి ధరలు ఇవాళ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,470 పెరిగి రూ.1,53,930కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాములు పసిడి ధర రూ.1,350 ఎగబాకి రూ.1,41,100 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు పెరిగి రూ.2,65,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News April 14, 2026
శాంతి భద్రతలను అందించడమే లక్ష్యం: నిర్మల్ ఎస్పీ

నిర్మల్ జిల్లా ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలను అందించడమే తమ లక్ష్యమని ఎస్పీ జానకి అన్నారు. నిర్మల్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని ఇందుకోసం రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ‘పోలీస్ అక్క’ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇటీవల జాతీయస్థాయిలో స్కోచ్ అవార్డు అందుకున్నామన్నారు.


