News March 29, 2025
యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదు

HYD అంబర్‌పేట పీఎస్‌లో యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69, 79, 352, 351(4) BNS సెక్షన్ల కింద అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపింది. కాగా శంకర్‌ది భువనగిరి జిల్లా.
Similar News
News November 28, 2025
NLG: ‘గెలిచినా, ఓడినా నేను ప్రజల మధ్యనే’

ఎమ్మెల్యే వీరేశం తనపై చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 25 ఏళ్ల నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని తానని, ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్యే స్థాయిలో ప్రజలకు సేవ చేశానని చెప్పారు. గెలిచినా, ఓడినా ప్రజలతోనే ఉన్నాను, ప్రజల మధ్యే ఉన్నానన్నారు. తాము చేసిన అభివృద్ధి పనులకు రెండేళ్లుగా వీరేశం ప్రారంభోత్సవాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు.
News November 28, 2025
మేడ్చల్: డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని బాల రక్షా భవన్(1098) వాహనం నడుపుటకు అనుభవం గల డ్రైవర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 10వ తరగతి చదివి, అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ధ్రువపత్రాలు(10వ తరగతి, అనుభవం, స్థానికత, ఆధార్ కార్డు) దరఖాస్తు ఫారమ్‌తో కలిపి డిసెంబర్ 15 సాయంత్రం 5 గంటలలోపు బాల రక్షా భవన్, జీవీ రెడ్డి కాలనీ(రైతు బజార్ ఎదురుగా)లో సంప్రదించాలి అన్నారు.
News November 28, 2025
నల్గొండ: ఓపెన్ టెన్త్, ఇంటర్‌కు చివరి అవకాశం..!

ఓపెన్ టెన్త్, ఇంటర్ చదవాలనుకునే విద్యార్థులకు చివరి గడువు తేదీని టాస్ డైరెక్టర్ శ్రీహరి పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ అకాడమిక్ ఇయర్లో చదవాలనుకునే విద్యార్థులు ఈనెల 29 నుంచి డిసెంబర్ 7 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆయా తేదీల్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నారు. ఈ విషయాలను టాస్ కోఆర్డినేషన్ సెంటర్స్ గమనించాలని సూచించారు.


