News March 29, 2025
యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదు

HYD అంబర్‌పేట పీఎస్‌లో యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69, 79, 352, 351(4) BNS సెక్షన్ల కింద అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపింది. కాగా శంకర్‌ది భువనగిరి జిల్లా.
Similar News
News April 20, 2025
పారదర్శకంగా భూభారతి చట్టం: మహబూబాబాద్ కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి- 2025 చట్టాన్ని జిల్లాలో పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. ఈ మేరకు చిన్న గూడూరు మండలం ఉగ్గంపల్లిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. గత భూ చట్టాల కంటే భిన్నంగా రైతుల భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు.
News April 20, 2025
వరల్డ్ కప్ కోసం భారత్ వెళ్లం: పాక్

భారత్‌లో జరగనున్న ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌లో తమ టీమ్ పాల్గొనబోదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ముందే జరిగిన ఒప్పందం ప్రకారం తటస్థ వేదికల్లోనే తాము ఆడతామని PCB ఛైర్మన్ నఖ్వీ తెలిపారు. ‘ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో భారత్ ఎలాగైతే మా దేశానికి రాకుండా న్యూట్రల్ వేదికల్లో ఆడిందో, మేము కూడా అలాగే ఆడతాం. WC ఆతిథ్య దేశమైన భారతే ఆ వేదికలను ఎంపిక చేయాలి’ అని నఖ్వీ అన్నారు.
News April 20, 2025
ప్రైవేట్ ఆస్పత్రుల్లో ముమ్మర తనిఖీలు

నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని వైద్యులు అర్హతకు మించి వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి కోటాచలం హెచ్చరించారు. సూర్యాపేటలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు చేశారు. వైద్యులు లేకుండానే హాస్పిటల్స్ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు.