News February 19, 2025
యూత్ అథ్లెటిక్స్ పోటీల్లో ADB బిడ్డల ప్రతిభ

హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న 11వ రాష్ట్రస్థాయి యూత్ అథ్లెటిక్స్ పోటీల్లో మంగళవారం మొదటి రోజు ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారులు నాలుగు పతకాలు కైవసం చేసుకున్నారు. అనిల్, రాణి సిల్వర్ మెడల్ సాధించగా, అరుణ, సక్కు కాంస్యం మెడల్స్ సాధించినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజేష్ తెలిపారు. క్రీడల్లో మరిన్ని పతకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
Similar News
News March 28, 2025
ADB: గొంతు కోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఆదిలాబాద్‌లో ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. కేఆర్కే కాలనీకి చెందిన నితిన్ మసూద్ చౌక్ సమీపంలో గురువారం బ్లేడ్‌తో గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్థానికులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న 1-టౌన్ సీఐ సునీల్ కుమార్, ఎస్ఐ అశోక్ రిమ్స్‌కు చేరుకొని ఘటనపై ఆరా తీశారు.
News March 28, 2025
అగ్నివీర్‌కు తాంసి యువకులు

తాంసి మండలం కప్పర్ల గ్రామానికి సందీప్, తన్వీర్ ఖాన్ అనే యువకులు గురువారం విడుదలైన అగ్నివీర్ ఫలితాల్లో ఎంపికయ్యారు. సందీప్ తండ్రి రమేశ్ వృత్తిరీత్యా వ్యవసాయం, తన్వీర్ ఖాన్ తండ్రి మునీర్ ఖాన్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తారు. పిల్లలకు నచ్చిన రంగాన్ని ప్రోత్సహించేలా తల్లిదండ్రులు సహకరించాలన్నారు.
News March 28, 2025
అడ్మిషన్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించండి: ADB DIEO

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదిలాబాద్ ఇంటర్ విద్యాశాఖ అధికారి జాదవ్ గణేశ్ కుమార్ సూచించారు. ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 2 వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. పది పరీక్షలు రాస్తున్న విద్యార్థుల ఇంటి వద్దకు వెళ్లి వారికి ప్రభుత్వ కళాశాల గురించి వివరించాలని సూచించారు. ఉచిత విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, స్కాలర్షిప్ సౌకర్యాలను వివరించాలన్నారు.