News March 20, 2025
యూనివర్సిటీకి బడ్జెట్లో నిధులు ఎంతంటే.?

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి రూ.50కోట్లు, జీతభత్యాలకు రూ.145.62కోట్లు కేటాయించింది. గత ఏడాది బడ్జెట్లో జీతభత్యాలకు రూ.135కోట్లు, రూ.500కోట్లు ప్రతిపాదించగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ బడ్జెట్లో ప్రవేశ పెట్టిన నిధులను యూనివర్సిటీకి ఖర్చు చేస్తారో, లేదో.. వేచి చూడాలి
Similar News
News November 15, 2025
ఇఫ్కో ఛైర్మన్తో సీఎం చర్చలు

విశాఖలో జరుగుతున్న సమ్మిట్లో ఇఫ్కో ఛైర్మన్ దిలీప్ ననూభాయ్ సంఘానీతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. గ్రీన్ అమ్మోనియా, హైడ్రోజన్ ఆధారిత ఫెర్టిలైజర్ ప్లాంట్ల ఏర్పాటు, రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. బయో-ఫర్టిలైజర్, బయో-స్టిమ్యులెంట్ యూనిట్ల స్థాపనకు ఉన్న అవకాశాల పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.
News November 15, 2025
కామారెడ్డి జిల్లా ఉపాధి అధికారిగా కిరణ్ కుమార్

జిల్లా ఉపాధి అధికారిగా కిరణ్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలసి పూలమొక్క అందించారు. పదవి బాధ్యతలను సక్రమంగా నిర్వహించి సమస్యలను తీర్చాలని కలెక్టర్ సూచించారు.
News November 15, 2025
రాజకీయాలు, కుటుంబానికి గుడ్బై: లాలూ కూతురు

బిహార్ మాజీ సీఎం, RJD పార్టీ ప్రెసిడెంట్ లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాలతో పాటు కుటుంబంతో బంధాన్ని తెంచుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. సంజయ్ యాదవ్, రమీజ్ పార్టీ నుంచి వెళ్లిపోమని తనతో చెప్పారని, మొత్తం నింద తానే తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో రోహిణి తన తండ్రి లాలూకు కిడ్నీ దానం చేసిన విషయం తెలిసిందే.


