News June 7, 2024

యూరప్‌కు కమిషనర్.. ఆమ్రపాలికి GHMC బాధ్యతలు

image

గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) కమిషనర్ రోనాల్డ్ రాస్ 13 రోజుల పాటు సెలవుపై వెళ్తున్నారు. శనివారం నుంచి ఈ నెల 23 వరకు ఆయన యూరప్‌‌లో పర్యటించనున్నారు. దీంతో జీహెచ్ఎంసీ అదనపు బాధ్యతలు HMDA(హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ) జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 13 రోజులు తాత్కాలికంగా ఆమె బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
SHARE IT

Similar News

News October 17, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ ట్రాఫిక్ డైవర్షన్స్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల కారణంగా నేడు ఉ.10 నుంచి మ.4 వరకు యూసుఫ్‌గూడ, కృష్ణానగర్, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ మార్గాలు పాటించలని, పార్కింగ్ కోసం మెట్రో పార్కింగ్ (జానకమ్మ తోట), సవేరా & మహమూద్ ఫంక్షన్ హాల్స్ అందుబాటులో ఉంటాయని, ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

News October 17, 2025

యూసుఫ్‌గూడ: అవిభక్త కవలలు వీణా-వాణిల పుట్టినరోజు వేడుకలు

image

అవిభక్త కవలలు వీణా-వాణిల 23వ జన్మదిన వేడుకలను యూసుఫ్‌గూడలోని స్టేట్ హోమ్‌లో గురువారం నిర్వహించారు. తమ పిల్లల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకొని తమను ఆదుకుంటుందని తల్లిదండ్రులు తెలిపారు. అలాగే, వైద్యరంగంలో జరిగిన అభివృద్ధితో తమ బిడ్డలైన అవిభక్త కవలలను విడదీసి సంపూర్ణ ఆరోగ్యంతో తమకు అప్పగించాలని కోరుతున్నారు.

News October 16, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: తొలి ర్యాండమైజేషన్ పూర్తి

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం ఈవీఎంలు, వీవీప్యాట్ల తొలి ర్యాండమైజేషన్ పూర్తయిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఇది నిర్వహించారు. ఆయా పార్టీల నేతల సమక్షంలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామన్నారు. జూబ్లీహిల్స్‌‌లో మొత్తం 407 పోలింగ్‌ కేంద్రాలకు 569 బ్యాలెట్ యూనిట్లు, 569 కంట్రోల్ యూనిట్లు, 610 వీవీప్యాట్లు కేటాయించారు.