News August 14, 2024

యూరప్‌లో ప్రకాశం వ్యక్తి మృతి.. సహచరుల తీరుపై అనుమానాలు

image

దోర్నాల మండలం హసనాబాద్‌కి చెందిన శివన్నారాయణ యూరప్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అతని సహచరుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘రూ. 2 లక్షలు పంపితే వీడియో కాల్ ద్వారా మృతదేహాన్ని చూపిస్తాం, రూ.10 లక్షలు పంపితే ఇండియాకు తీసుకొస్తాం’ అంటూ ఫోన్లు చేశారని, తర్వాత ఫోన్లు స్విచ్చాఫ్ చేశారని తల్లిదండ్రులు తెలిపారు. ప్రభుత్వం స్పందించాలని వారు కోరుతున్నారు.

Similar News

News September 13, 2024

బాపట్ల: ‘సర్వే పారదర్శకంగా నిర్వహించాలి’

image

వరద ప్రభావిత ప్రాంతాలలో అధికారులు దెబ్బతిన్న గృహాల సర్వే పారదర్శకంగా నిర్వహించాలని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. శుక్రవారం బాపట్ల కలెక్టరేట్ కార్యాలయం నుంచి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదకు బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలు అధికంగా దెబ్బతిన్నాయన్నారు. 24 లంక గ్రామాలలో దెబ్బతిన్న గృహాల వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలన్నారు. నష్టం అంచనాలను స్పష్టంగా ఉండాలన్నారు.

News September 13, 2024

బాలినేని పార్టీ మార్పుపై మరోసారి చర్చ

image

మాజీ మంత్రి బాలినేని వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరతారనే వార్తలు మరోసారి చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వైసీపీ క్యాడర్‌లో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. మరోవైపు, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌కు అధిష్ఠానం నుంచి గురువారం పిలుపొచ్చింది. ఈ క్రమంలో ఆయనకు జిల్లా బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో బాలినేని నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

News September 13, 2024

లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ

image

ఈనెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఎక్కువ కేసులు డిస్పోజల్ అయ్యేలా కృషి చెయ్యాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. పోలీస్ అధికారులు తమ స్టేషన్ల పరిధిలోని కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, కుటుంబ తగాదాలు, భూతగాదాలు, మోటార్ బైక్ యాక్సిడెంట్, చిట్ ఫండ్ వంటి కేసులు, ఇతర కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని గురువారం సూచించారు.