News January 8, 2025
యూరియా కొరత లేకుండా చూడాలి: మంత్రి కందుల
తూర్పుగోదావరి జిల్లాలో రైతులకు యూరియా కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఎరువులను సరఫరా చేయాలని సూచించినట్లు తెలిపారు. జనవరి 10వ తేదీ లోపు 2500 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు రంగం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News January 9, 2025
తూ.గో: అదిరిపోతున్న బస్ ఛార్జీలు..
సంక్రాంతికి సొంతూర్లకు వచ్చేందుకు కోనసీమ జిల్లా ప్రజలు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ట్రైన్ టికెట్స్ రిజర్వేషన్లు అయిపోయాయి. బస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయని ప్రయాణీకులు వాపోతున్నారు. హైదరాబాద్ నుంచి అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, మండపేట ప్రధాన పట్టణాలకు ప్రయివేట్ ట్రావెల్స్‌లో సుమారుగా రూ. 2,500 నుంచి రూ.3 వేల వరకు ఉన్నాయని చెబుతున్నారు. సంక్రాంతి సమయంలో ఛార్జీలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.
News January 9, 2025
కొత్తపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కొత్తపేట మండలం పలివెల వంతెన వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. నడిచివెళ్తున్న వ్యక్తిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో పలివెల గ్రామానికి చెందిన పెండ్రాల చెన్నయ్య (35) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 9, 2025
తూ.గో జిల్లా మీదుగా నడిచే 4రైళ్లు రద్దు
విజయవాడ డివిజన్ పరిధిలోని సాంకేతిక మరమ్మతుల కారణంగా ఈ నెల 11, 12న జిల్లా మీదుగా నడిచే 4రైళ్లను రద్దు చేస్తూ డివిజనల్ రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. 11న కాకినాడ పోర్టు- వైజాగ్, వైజాగ్- కాకినాడ పోర్టు (17267/17268), 12న గుంటూరు- వైజాగ్(17239), వైజాగ్- గుంటూరు(17240) రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.