News December 22, 2024
యూ.కొత్తపల్లి: బీరువా మీద పడి చిన్నారి మృతి
యూ.కొత్తపల్లి మండలం ఉప్పాడలోని ఫుల్ గాస్పల్ చర్చ్‌లో పాస్టర్‌గా ఉన్న రాజబాబు మనుమరాలు జయకేతన అనే రెండేళ్ల చిన్నారి క్రిస్మస్ వేడుకలకు తన తల్లి రత్న ప్రకాశ్‌తో కలిసి తాతయ్య ఇంటికి వచ్చింది. అయితే ఇల్లు శుభ్రపరుస్తూ ఉండగా ప్రమాదవశాత్తు బీరువా చిన్నారిపై పడింది. దీంతో కొత్తపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Similar News
News January 13, 2025
పిఠాపురంలో 389 బైండోవర్ కేసులు
పిఠాపురం నియోజవర్గంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో 389 బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. పేకాట, కోడిపందేలు నిర్వహిస్తారన్న సమాచారంతో రెండు కోళ్లు, రూ. 24 వేల నగదు స్వాధీన పరుచుకొని 14 మందిని అరెస్టు చేశామన్నారు. కోడిపందేలు జరిగే ప్రాంతాలను గుర్తించి 35 మంది స్థల యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
News January 13, 2025
తూ.గో: నేడు, రేపు రైళ్లు రద్దు
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సోమవారం, మంగళవారం ఏర్పాటు చేసిన కాకినాడ టౌన్-చర్లపల్లి, చర్లపల్లి- కాకినాడ టౌన్ మధ్య రాకపోకలు సాగించే రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ఆదివారం ప్రకటించారు. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ఈ రెండు రైళ్లకు తగిన ప్రయాణికులు లేకపోవడంతో వీటిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
News January 13, 2025
తూ.గో: భోగి మంట వేస్తున్నారా?
సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.