News June 21, 2024
యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం: కిషన్ రెడ్డి

తెలంగాణలో ఘనంగా అంతర్జాతీయ యోగా దశాబ్ధి ఉత్సవాలు జరుగుతున్నాయి. నిజాం కాలేజీ గ్రౌండ్లో ఉత్సవాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర బొగ్గు గనుల సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే, రాజ్య సభ సభ్యుడు లక్ష్మణ్ బిజెపి నేతలు పాల్గొన్నారు. విద్యార్థులు యోగా శరీరం మనుసును కలుపుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం, యోగానే ఒక్క డాక్టర్ అని అన్నారు.
Similar News
News November 22, 2025
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన CISF సెక్యూరిటీ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. క్షుణ్ణంగా అనుమానిత వస్తువులను పరిశీలించారు. సందర్శకుల పాసుల కౌంటర్ మూసివేశారు. చివరకు ఎలాంటి బాంబు లేదని, అది ఫేక్ మెయిల్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.
News November 22, 2025
HYD: నేడు కార్గో వస్తువుల వేలం

HYDలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో పెండింగ్లోని కార్గో, పార్సిల్ వస్తువులకు నేడు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జోన్ లాజిస్టిక్ మేనేజర్ బద్రి నారాయణ తెలిపారు. MGBSలోని పార్సిల్ గోడౌన్ ఆవరణలో ఉదయం 10 గంటలకు వేలం ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు వేలంలో పాల్గొనాలని కోరారు.
News November 22, 2025
HYD: KPHBలో విదేశీ యువతులతో వ్యభిచారం.. జైలు శిక్ష

KPHB PS పరిధిలో విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహించిన నిర్వాహకుడికి కూకట్పల్లి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో పోలీసులు ఓ ఇంటిపై దాడి చేసి ముఠాను అరెస్ట్ చేశారు. నిర్వాహకుడు రిపాన్తో పాటు బంగ్లాదేశ్ యువతులను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేశారు. సివిల్ జడ్జి సంధ్యారాణి విచారణ చేపట్టి శిక్ష ఖరారు చేసి తీర్పు ఇచ్చారు.


