News June 29, 2024

యోగివేమన యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామా

image

YVU వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ చింతా సుధాకర్, రిజిస్ట్రార్ ఆచార్య వెంకటసుబ్బయ్య రాజీనామా చేశారు. రిజిస్ట్రార్ రాజీనామాకు VC ఆమోదం తెలిపారు. అనంతరం YVU వీసీ ఆచార్య సుధాకర్ శనివారం సాయంత్రం రాజీనామా చేశారు. ఈ సమాచారాన్ని ఉన్నత విద్యా మండలి కార్యదర్శికి పంపారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా YVU ప్రిన్సిపల్ రఘునాథరెడ్డికి వారు నియామక పత్రం అందజేశారు.

Similar News

News October 22, 2025

కడప జిల్లాలోని స్కూళ్లకు రేపు సెలవు

image

కడప జిల్లాలో అన్ని పాఠశాలలకు గురువారం సెలవులు ప్రకటిస్తూ డీఈవో శంషుద్దీన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా సెలవు ఇస్తున్నట్లు ప్రకటించారు. కాగా 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇవాళ కూడా పలు మండలాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

News October 22, 2025

కడప జిల్లాలో పరిస్థితిని బట్టి స్కూళ్లకు సెలవు

image

భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణశాఖ వర్ష సూచనలు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా కడప జిల్లాలో మండలాల వారీగా నేడు స్థానికంగా ఉన్న పరిస్థితులు, వర్షాలు, ఇబ్బందులు ఆధారంగా సెలవును మండల MEOలు ప్రకటించాలని జిల్లా విద్యాశాఖ అధికారి కొద్దిసేపటి క్రితమే సర్కిలర్ జారీ చేశారు.

News October 22, 2025

కడప జిల్లా కలెక్టర్‌కు సెలవులు మంజూరు.!

image

కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఈనెల 21 నుంచి 29 వరకు సెలవుపై వెళ్లనున్నారు. కాగా జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా JC అతిధిసింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు సెలవు మంజూరు చేస్తూ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ తిరిగి 29వ తేదీన విధుల్లో చేరనున్నారు.