News April 11, 2025
యోగి వేమన విశ్వవిద్యాలయానికి స్వర్ణ పతకం

కడప: కశ్మీర్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు జరిగిన అఖిల భారత అంతర విశ్వవిద్యాలయ పవర్ లిఫ్టింగ్ పోటీలలో యోగి వేమన విశ్వవిద్యాలయానికి స్వర్ణ పతకం లభించింది. విద్యార్థి డి.మురళీకృష్ణ 59వ కేజీల విభాగంలో బంగారు పతకం సాధించారు. వైవీయూకు ఈ పతకం ఐదవది. వర్సిటీ క్రీడా బోర్డు సహాయ సహకారాలు అందజేయడం ద్వారా ఈ పతకం సొంతమైనట్లు క్రీడా బోర్డు కార్యదర్శి డాక్టర్ రామ సుబ్బారెడ్డి తెలిపారు.
Similar News
News December 16, 2025
కడప జిల్లాలో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్

కడప జిల్లాలో విండ్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు హెటిరో సంస్థకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లాలోని కొండాపురం మండలం టి.కోడూరులో 30 ఎకరాలు, చామలూరు గ్రామంలో 10 ఎకరాలు, కొప్పోలులో 5 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎకరాకు ఏడాదికి రూ.3 లక్షలు లీజు ప్రాతిపాదికన భూములు కేటాయించారు.
News December 15, 2025
కడప: డాక్టరేట్ అందుకున్న అధ్యాపకుడు

కడప డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి చెందిన యానిమేషన్ విభాగం అధ్యాపకుడు డా.ఉండేల శివకృష్ణా రెడ్డి డాక్టరేట్ అందుకున్నారు. చెన్నైలోని హిందుస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య బి.జయరామిరెడ్డి పట్టా అందజేసి అభినందించారు.
News December 15, 2025
దువ్వూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

దువ్వూరులోని మురళి నగర్ మెట్ల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సొంత పనులు కోసం నడుచుకుంటూ వెళుతున్న వీర ప్రతాపరెడ్డి, ఎల్లయ్య అనే వ్యక్తులను ప్రొద్దుటూరు వైపు నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఎల్లయ్యది నేలటూరు కాగా, వీర ప్రతాప్ రెడ్డిది గోపులాపురంగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు


