News January 30, 2025

రంగంపేట: మాగంటి రూపకి శుభలేఖ అందజేసిన ఎమ్మెల్యే 

image

అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనయుడు మనోజ్ రెడ్డి వివాహం ఫిబ్రవరి 8న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నల్లమిల్లి హైదరాబాదులో పలువురు ప్రముఖులకు వివాహ ఆహ్వానాలు అందజేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి మాజీ ఎంపీ, మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూపకి కళ్యాణ శుభలేఖను అందజేశారు. కార్యక్రమంలో గోదావరి జిల్లాల జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగు పాల్గొన్నారు.

Similar News

News November 15, 2025

తూ.గో: 48 గంటల్లో రూ.56.84 కోట్ల జమ

image

తూ.గో జిల్లా ధాన్యం సేకరణ అంచనా 4 లక్షల మెట్రిక్ టన్నులుగా నిర్ణయించినట్లు జేసీ వై.మేఘ స్వరూప్ వెల్లడించారు. ప్రస్తుతానికి 5,890 ధాన్యం కొనుగోలు కూపన్లు జనరేట్ చేశామన్నారు. 16 మండలాల్లో 122 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 3,695 మంది రైతుల నుంచి 27,616.360 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు చెప్పారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోపే 3,191 మంది రైతులకు రూ. 56.84 కోట్లు జమ చేశామని తెలిపారు.

News November 15, 2025

తూ.గో: సదరం క్యాంపులు ప్రారంభం

image

తూ.గో జిల్లా వ్యాప్తంగా కొత్త సదరం సర్టిఫికెట్ల జారీ కోసం స్లాట్‌ బుకింగ్ శుక్రవారం నుంచి ప్రారంభమైందని DCHS డా.ఎం.పద్మ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, ప్రతి మంగళవారం ఏరియా హాస్పిటళ్లు, జిల్లా ఆసుపత్రులు, GGHల్లో సదరం సర్టిఫికెట్ల కోసం స్క్రీనింగ్ పరీక్షలు చేస్తామని చెప్పారు.

News November 15, 2025

దివాన్ చెరువులో కొత్త బిల్డింగ్‌కు రూ.3కోట్లు

image

రాజమహేంద్రవరం రూరల్ డివిజన్, సబ్-డివిజన్, రూరల్ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసులకు సంబంధించిన భవనాలు వేర్వేరు చోట్ల ఉన్నాయి. ఇవన్నీ ఒకేచోట ఉండేలా దివాన్ చెరువులో కొత్తగా భవనం నిర్మించనున్నారు. దీని కోసం రూ.3కోట్లు మంజూరయ్యాయని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెల్లడించారు. నిధులు మంజూరు చేసిన ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజకి కృతజ్ఞతలు తెలిపారు.