News January 28, 2025

రంగంపేట: స్మశానవాటికలో స్కూల్ నిర్మాణంపై ఫిర్యాదు

image

రంగంపేట రెవెన్యూ కార్యాయంలో అధికారులు సోమవారం పీజీఆర్‌ఎస్‌ నిర్వహించారు. పాతకోటపాడులోని సర్వే నంబర్ 44లో 2.71ఎకరాలను పలు సామాజిక వర్గాలు శ్మశానంగా వినియోగిస్తున్నాయి. అదే స్థలాన్ని హైస్కూల్ నిర్మాణానికి కేటాయించడంపై సహించేది లేదని తహశీల్దార్ కోను అనసూయకు ఇండియన్ యాక్ట్స్ ఆవెర్నెస్ వలంటరీ ఆర్గనైజేషన్ రాష్ట్ర ఛైర్మన్ కుందేటి వెంకట రమణ వినతి పత్రాన్ని సమర్పించారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News July 9, 2025

రాజమండ్రి: ఆర్టీసీలో 9 మందికి కారుణ్య నియామకాలు

image

ఉమ్మడి తూ.గో జిల్లా‌లో మంగళవారం ఆర్టీసీలో కారుణ్య నియామకాలు జరిగాయి. సహజ మరణాలతో పాటు మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులకు ఈ నియామకాలు జరిగాయి. స్థానిక ఆర్ఎం కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో తూ.గో జిల్లా డీపీటీవో వై‌ఎస్‌ఎన్ మూర్తి , కాకినాడ డీపీటీవో ఎం. శ్రీనివాసరావు, కోనసీమ డీపీటీవో రాఘవ కుమార్‌లు పాల్గొని 9 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.

News July 9, 2025

అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు: ఎస్పీ

image

మత్తు పదార్థాలు, పొగాకు ఉత్పత్తుల అక్రమ నిల్వలు ఎవరు కలిగి ఉన్నా ఉపేక్షించేది లేదని, ఆయా షాపు యజమానులపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డి. నరసింహ కిషోర్ హెచ్చరించారు. “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్” లో భాగంగా మంగళవారం జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్కూళ్లు, కాలేజీలకు100 గజాల దూరంలో ఉన్న షాపులలో పొగాకు, గుట్కా నిల్వల పై సోదాలు చేసి కేసులు పెట్టమన్నారు. స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తామని చెప్పారు.

News July 9, 2025

ధవళేశ్వరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఇసుక లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ధవళేశ్వరంలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు పెయింటింగ్ పని చేసుకుని జీవించే పువ్వుల లక్ష్మణరావు (39) మంగళవారం రాజమండ్రి‌లో పని కోసం వెళ్తుండగా ఇసుక లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.