News March 15, 2025
రంగారెడ్డి: ఇంటర్ పరీక్షకు 759 మంది గైర్హాజరు

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 185 సెంటర్లలో 62,053 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 61,294 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 759 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారన్నారు. జిల్లావ్యాప్తంగా ఒక్క మాల్ ప్రాక్టీస్ కేసు కూడా నమోదు కాలేదన్నారు.
Similar News
News October 30, 2025
BREAKING: హైదరాబాద్‌లో యువకుడి దారుణ హత్య

HYDలో దారుణ ఘటన వెలుగుచూసింది. బండ్లగూడలో బుధవారం రాత్రి ఓ పాన్ షాపు యజమాని దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోసిన్ (22) ఓల్డ్ సిటీకి చెందినవాడు. ఇతడికి రెండు నెలల క్రితమే వివాహమైంది. నలుగురు గుర్తు తెలియని దుండగులు దుకాణం వద్ద కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. బండ్లగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News October 28, 2025
జూబ్లీ బైపోల్: మంత్రులకు బాధ్యతలు

జూబ్లీహిల్స్ బైపోల్‌లో భాగంగా డివిజన్ల వారీగా మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు.
రహమత్‌నగర్- కోమటిరెడ్డి, పొంగులేటి, బోరబండ- సీతక్క, మల్లు రవి, వెంగళ్‌రావునగర్- తుమ్మల, వాకిటి శ్రీహరి, సోమాజిగూడ- శ్రీధర్ బాబు, అడ్లూరి, షేక్‌పేట్- కొండా సురేఖ, వివేక్, ఎర్రగడ్డ- దామోదర, జూపల్లి, యూసుఫ్‌గూడ- ఉత్తమ్, పొన్నం ప్రభాకర్‌కు కేటాయించారు.
News October 28, 2025
శంకర్ మఠాన్ని సందర్శించిన రాంచందర్‌రావు

HYDలోని నల్లకుంట శృంగేరి శంకర్ మఠాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సందర్శించారు. శ్రీ శారదాంబ అమ్మవారిని దర్శించుకొని, దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురువు శంకరాచార్య శ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి ఆశీర్వాదాలు తీసుకున్నారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.


