News July 29, 2024
రంగారెడ్డి: ఈ-ఆఫీస్ సేవలన్నీ ఇక ఆన్‌లైన్‌లోనే

RR కలెక్టరేట్‌లో త్వరలోనే ఈ-ఆఫీస్ కార్యకలాపాలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు కాగితాలపై కొనసాగుతున్న సేవలు.. ఇకపై ఆన్‌లైన్ ద్వారా సాగనున్నాయి. పాలనలో పారదర్శకత, కచ్చితత్వం, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్న కలెక్టర్ శశాంక వీలైనంత త్వరగా ఈ-ఆఫీస్ సేవలను అందుబాటులోకి తేవాలని సంకల్పించారు. అంతేకాకుండా అధికారులు, సిబ్బందికి సాంకేతిక నైపుణ్యంపై ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నారు.
Similar News
News November 9, 2025
జూబ్లీహిల్స్‌లో అంతా గప్‌చుప్..!

దాదాపు నెలరోజులుగా స్పీకర్ సౌండ్‌లు, ఓటర్లతో మీటింగ్‌లు, హామీలతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం హోరెత్తింది. ఇవాళ ముగింపు ప్రచారంలో 3 ప్రధాన పార్టీల నేతలు చెలరేగిపోయారు. కాగా ఎలక్షన్‌కు 48గంటల ముందు ప్రచారం ముగించాలన్న నిబంధనతో అంతా గప్‌చుప్ అయింది. ఇక గప్‌చుప్‌గా లోకల్ నేతల హవా నడువనుంది. నోట్ల పంపిణీ, ఓటర్లను మచ్చిక చేసుకోవడం అంతా వీరి చేతుల్లోనే ఉంటుందిక. మళ్లీ సంబరాలు రిజల్ట్స్ డే రోజే ఇక.
News November 9, 2025
గచ్చిబౌలి: ముగిసిన ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ పోటీలు

గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ 2025 బ్యాడ్మింటన్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. పలు దేశాల నుంచి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని ఉత్కంఠభరిత మ్యాచ్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముగింపు కార్యక్రమానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్, కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
News November 9, 2025
‘హైడ్రా నా అస్త్రం.. పేదల ఇళ్లు కూల్చేయడమే నాకిష్టం’

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా యూసుఫ్‌గూడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ నగరంలో హైడ్రా చేసిన విధ్వంసాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా వీడియోలతో చూపించారు. ఈ సందర్భంగా రోడ్ షోలో ఓ వ్యక్తి ‘హైడ్రా నా అస్త్రం.. పేదల ఇళ్లు కూల్చేయడమే నాకిష్టం’ అని రేవంత్ ఫొటోతో ఉన్న బ్యానర్ ప్రదర్శించారు.


