News October 28, 2024

రంగారెడ్డి కలెక్టర్ బదిలీ.. నూతన కలెక్టర్ ఈయనే

image

రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు RR జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న శశాంకను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో నల్గొండ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న నారాయణరెడ్డిని RR జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 2015 బ్యాచ్‌కు చెందిన IAS అధికారి. గతంలో VKBకి కలెక్టర్‌గా చేశారు.

Similar News

News February 21, 2026

RR: వారికి 100% రాయితీతో రూ.60వేలు

image

రాళ్లు కత్తిరించే వృత్తిలో అనుభవం ఉన్న ముస్లింలకు పునరావాసం, జీవనోపాధి కల్పిస్తున్నట్లు జిల్లా మైనారిటీ శాఖ అధికారి నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారుడికి రూ.60 వేల చొప్పున, రూ.10 వేల విలువైన టూల్ కిట్, రూ.50 వేల విలువైన జనరేటర్‌ను 100% సబ్సిడీ కింద అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే నెల 1 వరకు http://tsobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

News February 21, 2026

బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్

image

రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా (స్థానిక సంస్థలు) ప్రతిమా సింగ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా కొనసాగిన ప్రతిమాసింగ్ ప్రసూతి సెలవులపై వెళ్లారు. ప్రసూతి సెలవులు ముగియడంతో ఆమె శనివారం తిరిగి అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు అదనపు కలెక్టర్‌ను కలిసి బొకే సమర్పించారు.

News February 21, 2026

RR: సోమవారం నుంచి యథావిధిగా ‘ప్రజావాణి’

image

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 23 (సోమవారం) నుంచి యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రజావాణి తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ప్రజవాణి యథావిధిగా కొనసాగుతుందన్నారు.