News December 19, 2024

రంగారెడ్డి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు

image

రంగారెడ్డి జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. రెడ్డిపల్లిలో 10.8, చందనవెల్లి 11.7, HCU 11.8, కేతిరెడ్డిపల్లి 12.1, రాజేంద్రనగర్ 12.2, అమీర్‌పేట, తాళ్లపల్లి 12.3, ఎలిమినేడు 12.5, కాసులాబాద్ 12.6, ధర్మసాగర్ 12.9, రచూలూరు 13 మీర్‌ఖాన్‌పేట, మంగళపల్లె 13.3, పసుమాముల, షాబాద్, శంకర్పల్లి 13.4 ప్రొద్దుటూరు 13.6, మొయినాబాద్ 13.7, ఆరుట్ల, దండుమైలారం 13.9, శివరాంపల్లి 14.1, గచ్చిబౌలిలో 14.3℃గా నమోదైంది.

Similar News

News November 16, 2025

షాద్‌నగర్: ‘నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి’

image

షాద్‌నగర్ సమీపంలోని ఎల్లంపల్లి గ్రామ యువకుడు రాజశేఖర్ హత్యను బహుజన్ సమాజ్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. రాజశేఖర్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హత్యకు ముందు మృతుడిని నిందితులు కిడ్నాప్ చేస్తే కుటుంబ సభ్యులు 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చినా ఎందుకు రక్షించలేదని ప్రశ్నించారు.

News November 16, 2025

రంగారెడ్డి జిల్లాలో 2 కోట్ల చేపపిల్లల లక్ష్యం

image

రంగారెడ్డి జిల్లాలో చెరువులు, కుంటలు వెయ్యికిపైగా ఉన్నాయి. వాటిలో 2 కోట్లకుపైగా చేప పిల్లలు అవసరం ఉండగా.. 59 లక్షలు మాత్రమే వచ్చాయి. అయితే జిల్లాలో సుమారు 15వేల మంది చేపలు పట్టడం, వాటిని విక్రయించడం ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మిగతా వాటిని కూడా పంపిణీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. కాగా, మరిన్ని చేప పిల్లల కోసం ప్రతిపాదనలు పంపించినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి పూర్ణిమ తెలిపారు.

News November 15, 2025

రంగారెడ్డి: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థులు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని రంగారెడ్డి బీసీ సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు జీ.ఆశన్న సూచించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు 2025-26 సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలనన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు.