News February 26, 2025
రంగారెడ్డి జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా

రంగారెడ్డి జిల్లాలో మంగళవారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా ఫరూఖ్‌నగర్‌లో 37.7℃, మొయినాబాద్‌లో 36.7, హయత్‌నగర్‌లో 36.5, మొయినాబాద్‌లో 36.3, మొయినాబాద్‌లో 36.2, శేరిలింగంపల్లిలో 35.9, షాబాద్‌లో 35.8, ఇబ్రహీంపట్నంలో 35.7, శంకర్‌పల్లి, సరూర్‌నగర్‌లో 35.4, చేవెళ్లలో 35.3℃ ష్ణోగ్రత నమోదైంది. కాగా ఈ ప్రాంతాలన్నీ ఎల్లో జోన్‌లో ఉన్నాయి.
Similar News
News March 20, 2025
HYD: ఓయూలో తగ్గేదే లే!

ఓయూలో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. నిరసనలు నిషేధం అన్న సర్క్యూలర్ అగ్గిరాజేసింది. ఉమ్మడి రాష్ట్రంలో లేని ఆంక్షలు ఇప్పుడు పెట్టడం ఏంటని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. వామపక్షాలు నేడు బంద్‌కు పిలుపునివ్వడంతో విద్యార్థులు మళ్లీ రోడ్డెక్కారు. ఇది నిబంధన కాదు నిర్బంధం అంటూ గొంతెత్తారు. వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. ఇక అధికారులూ బెట్టు వీడకపోవడంతో పోలీసులు రంగప్రవేశం తప్పడం లేదు. దీనిపై మీ కామెంట్?
News March 20, 2025
రాజ్‌భవన్ రోడ్డులోని ATMలో పాడు పని!

ATMలో ఓ వ్యక్తి చేసిన పాడు పని ఆలస్యంగా వెలుగుచూసింది. పంజాగుట్ట PS పరిధి రాజ్‌భవన్ రోడ్డు RBL ATM పనిచేయడం లేదని సిబ్బంది తనిఖీ చేశారు. సెన్సార్ పనిచేయడం లేదని గుర్తించి, సీసీ టీవీ పరిశీలించగా కంగుతిన్నారు. ఈ నెల 10వ తేదీన రాత్రి ఓ యువకుడు డబ్బులు డ్రా చేశాడు. అనంతరం ATM మిషన్ పక్కనే మూత్రవిసర్జన చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News March 20, 2025
హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో రద్దీ

సమ్మర్ ఎఫెక్ట్‌తో నగరవాసులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. గురువారం ఉ. అమీర్‌పేట స్టేషన్‌కు ప్రయాణికులు క్యూ కట్టారు. ప్లాట్‌ఫాం పూర్తిగా నిండిపోయింది. రాయదుర్గ్ రూట్‌లో వెళ్లేవారికి నిరీక్షణ తప్పలేదు. ట్రైయిన్‌లో కిక్కిరిసి ప్రయాణించారు. డ్యూటీకి వెళ్లేవారు అసౌకర్యానికి గురయ్యారు. ఇలా అయితే ఎలా పోవాలి అయ్యా ఆఫీస్‌కి అంటూ ఓ నెటిజన్ @ltmhydని ప్రశ్నించారు. ఇకనైనా సర్వీసులు పెంచాలని కోరుతున్నారు.