News February 8, 2025
రంగారెడ్డి జిల్లా మార్నింగ్ అప్డేట్ @7AM
రంగారెడ్డి జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. అత్యల్పంగా రెడ్డిపల్లిలో 14.4℃, చుక్కాపూర్ 14.7, చందనవెల్లి 15.1, కాసులాబాద్ 15.5, హైదరాబాద్ విశ్వవిద్యాలయం 15.4, మంగళపల్లి 16.3, రాజేంద్రనగర్ 15.7, కొందుర్గ్ 15.7, ఎలిమినేడు15.4, రాచలూరు 16, విమానాశ్రయం 15.8, దండుమైలారం 16.8, తొమ్మిదిరేకుల 15.8, కేతిరెడ్డిపల్లి 15.8, వైట్‌గోల్డ్ SS 16.1, వెల్జాల 16.2, అమీర్‌పేటలో 16.6℃గా నమోదైంది.
Similar News
News February 8, 2025
HYD: ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలి: MLC కవిత
అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని MLC కవిత అన్నారు. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద వివిధ దేశాల్లో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులతో BRS ఎమ్మెల్సీ కవిత జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లకు డబ్బులు విడుదల చేస్తున్నారు కానీ, విద్యార్థుల చదువుకు బకాయిలు విడుదల చేయడానికి మాత్రం డబ్బులు లేవా అని ప్రశ్నించారు. తక్షణమే నిధులు విడుదల చేయాలన్నారు.
News February 8, 2025
గండిపేట: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని RR జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. గండిపేట మండలం నార్సింగిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు స్వచ్ఛమైన రుచికరమైన ఆహారం అందించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
News February 8, 2025
UPDATE: బాలికపై లైంగిక దాడి..రిమాండ్
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇన్‌ఫ్రంట్ జీసస్ ఇంటర్నేషనల్ <<15393818>>స్కూల్ డ్రైవర్ <<>>6ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన విషయం తెలిసిందే. కాగా, జోసఫ్ రెడ్డిపై పోక్సో యాక్ట్ కింద మంచాల పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసిన మంచాల పోలీసులు రిమాండ్‌కు తరలించారు.