News June 7, 2024
రంగారెడ్డి: న్యాయ పరిపాలన శిక్షణకు దరఖాస్తులు
న్యాయ పరిపాలన శిక్షణ పొందేందుకు ఉమ్మడి RR (రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి) జిల్లాకు చెందిన ఎస్సీ అభ్యర్థుల నుంచి జూలై 6వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్ తెలిపారు. బేసిక్ డిగ్రీ, లా డిగ్రీ పొంది జులై 1కల్లా 23 ఏళ్లు నిండిన వారు ఈ శిక్షణకు అర్హులన్నారు. https://telanganaepass వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు.
Similar News
News December 21, 2024
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వీడ్కోలు
శీతాకాల విడిది కోసం మంగళవారం హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శనివారం హకీంపేట్ విమానాశ్రయంలో వీడ్కోలు పలికారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు వేణుగోపాల్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, మేడ్చల్ జిల్లా కలెక్టరు గౌతమ్ తదితరులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘనంగా వీడ్కోలు పలికారు.
News December 21, 2024
RR: 8నెలలుగా కూలీలకు అందని జీతాలు.!
ఉమ్మడి RR జిల్లాలో 52 వరకు ఎస్సీ వసతి గృహాల్లో 8 నెలలుగా జీతాలు లేవని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.160 మంది అవుట్ సోర్సింగ్, 44 మంది దినసరి కూలీలు పనిచేస్తున్నారు. ఇంటిదగ్గర కుటుంబాన్ని పోషించడం భారంగా మారుతుందని, అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు జీతాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
News December 21, 2024
HYD: శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ చికిత్సకు స్పందిస్తున్నాడు. వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్నట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉండగా.. అప్పుడప్పుడు జ్వరం వస్తోంది. నాడీ వ్యవస్థ ప్రస్తుతానికి స్థిరంగా పనిచేస్తుందని.. నిన్నటి కంటే ఈరోజు శ్రీతేజ ఆరోగ్యం మెరుగైందని శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.