News February 13, 2026
రంగారెడ్డి: పుర ‘పోరు’.. నేడే ఫలితాలు

TG వ్యాప్తంగా FEB 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. కౌంటింగ్‌కు అధికారులు అంతా సిద్ధం చేశారు. ఉమ్మడి రంగారెడ్డిలోని 13 మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది. ఆమన్‌గల్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మొయినాబాద్, షాద్‌నగర్, శంకర్‌పల్లి, అలియాబాద్, ఎల్లంపేట, మూడుచింతలపల్లి, వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి మున్సిపాలిటీల వారీగా కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Similar News
News March 7, 2026
సివిల్స్ అభ్యర్థులకు రేవంత్ అభినందనలు.. BRSపై విమర్శలు

TG: సివిల్స్‌లో సత్తా చాటిన తెలుగు అభ్యర్థులకు CM రేవంత్ అభినందనలు తెలిపారు. ‘రాజీవ్ సివిల్స్ అభయ హస్తం’ ద్వారా సాయం పొందిన 20 మంది మంచి ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. ‘గత ప్రభుత్వం పేదల బిడ్డలు బర్లు, గొర్లు కాసుకొని బతకాలని భావించింది. మన ప్రభుత్వం వారి విద్యకు ప్రాధాన్యం ఇచ్చి IASలు, IPSలుగా ఎదగాలని తోడుగా నిలుస్తోంది’ అని ట్వీట్ చేశారు. వారు TG పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్నారు.
News March 7, 2026
ఫలితాలు విడుదల.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 89 మంది ఎంపిక

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 608 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల మెరిట్ జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది. ఇందులో వనపర్తి డివిజన్ నుంచి 44, మహబూబ్ నగర్ డివిజన్ నుంచి 45 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఎంపికైన వారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో మార్చి 23వ తేదీలోగా సంబంధిత డివిజన్ కార్యాలయాల్లో వెరిఫికేషన్‌కు హాజరు కావాలని అధికారులు సూచించారు.
News March 7, 2026
MBNR: రేపే సదస్సు.. మిస్ అవ్వకండి

10th క్లాస్ తర్వాత స్టూడెంట్స్ భవిష్యత్తుపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News & Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా మార్చి 8న(ఆదివారం) MBNR రైల్వేస్టేషన్ రోడ్డులోని సుదర్శన్ ఫంక్షన్ హాల్‌లో ఉ.10.30 గంటలకు ఈ సదస్సు నిర్వహించనుండగా CBI EX JD లక్ష్మీనారాయణ పాల్గొననున్నారు. స్టూడెంట్స్, వారి పేరెంట్స్ హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.


