News May 11, 2024
రంగారెడ్డి: పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు: కలెక్టర్

ఈసీ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక శనివారం ఆదేశించారు. చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళలు, యువత, దివ్యాంగులను పోలింగ్‌లో భాగస్వామ్యం చేసేలా, ఆ సందేశం స్పష్టంగా తెలిసేలా మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి సదుపాయాలను సరిచూసుకోవాలన్నారు.
Similar News
News February 9, 2025
HYD: బాలికపై లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు!

నార్సింగి PS పరిధిలో బాలికపై అత్యాచారం జరిగిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికను మధుసూదన్, జయంత్, సాయి, తరుణ్ అత్యాచారం చేసి ఇంట్లో నుంచి డబ్బు, బంగారం తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆమె రూ.10వేలు వారికి ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడీగా ఉంటున్న బాలికను తల్లి నిలదీయగా జరిగిన విషయం చెప్పింది. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా నలుగురిని శుక్రవారం రిమాండ్ చేశారు.
News February 9, 2025
హైదరాబాద్ ప్రాజెక్టులపై సీఎం సమీక్ష

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం జరిగింది. మీరాలం చెరువుపై నిర్మిస్తున్న బ్రిడ్జికి సంబంధించి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. 90 రోజుల్లో బ్రిడ్జి డీపీఆర్ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి పరిసరాలను రూపొందించాలని సీఎం అన్నారు. రోడ్ల వెడల్పుపైనా పలు సూచనలు చేశారు.
News February 8, 2025
అబిడ్స్ DIపై భార్య ఫిర్యాదు

అబిడ్స్ పోలీస్ స్టేషన్ డీఐ నరసింహపై ఆయన భార్య సంధ్య హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పెళ్లై 12 ఏళ్లు అవుతుందని, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, అదనపు కట్నం ఇవ్వకపోతే రెండో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.