News June 11, 2024

రంగారెడ్డి: బడి బస్సులపై నజర్

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 11,922 బడి బస్సులు ఉండగా… ఇప్పటివరకు 8,917 బస్సులు మాత్రమే ఫిట్నెస్ ధ్రువీకరణ పొందాయి. మరో 3,005 బస్సులకు సామర్ధ్య నిర్ధారణ కాలేదని DTC చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. 15 ఏళ్ల సర్వీస్ దాటిన బస్సులు ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై తిరగరాదని స్పష్టం చేశారు. ఇలాంటి బస్సుల్లో పిల్లలను తీసుకెళ్తే వెంటనే సీజ్ చేసి యాజమాన్యాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News December 1, 2025

పాతబస్తీలో అండర్‌గ్రౌండ్ సర్జరీ!

image

మెట్రో రైలు ఫేజ్-II (MGBS-చాంద్రాయణగుట్ట) కారిడార్‌లో పాతబస్తీకి శాశ్వత పరిష్కారం దక్కనుంది. కేవలం ఆరు నెలల్లోనే రూ.39.6 కోట్లతో కీలక జల వసతి పనులు పూర్తి చేయాలని HMWSSB నిర్ణయించింది. మైసారం, అలియాబాద్, మిస్రిగంజ్, దారుల్షిఫా, మొఘల్‌పురా, జంగంమెట్, గౌలిపురా, ఎంఆర్జీ ప్రాంతాల మీదుగా ఉన్న 100-1200 mm డయా తాగునీరు, డ్రైనేజీ లైన్లను మెట్రో పిల్లర్ల మార్గం నుంచి పూర్తిస్థాయిలో మార్చనున్నారు.

News December 1, 2025

హైదరాబాద్ శివారు రోడ్లకు మహర్దశ

image

HYD శివారు రోడ్ల విస్తరణ కోసం ప్రభుత్వం రూ.390కోట్ల భారీ ప్రాజెక్టును ప్రకటించింది. 148.85 కి.మీ. మేర రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దడానికి టెండర్లు పిలిచింది. HAM పద్ధతిలో ప్రాజెక్టును చేపడుతున్నారు. దీని ప్రకారం, ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో కొంత భాగాన్ని ప్రభుత్వం నేరుగా భరిస్తుంది. ఈప్రాజెక్టును (PPP) ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాంతో చేపట్టనున్నట్లు అధికారులు Way2News‌కు తెలిపారు.

News December 1, 2025

HYD: కరెంటు బిల్లే క్రెడిట్ స్కోరు.!

image

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో ప్రభుత్వం కీలక ఆర్థిక సంస్కరణను ప్రకటించనుంది. ‘రుణ చరిత్ర లేని’ ప్రజల కోసం తెలంగాణ ఇన్ఫర్మేషన్ బ్యూరో (TIB) ఏర్పాటు కానుంది. ఈ సంస్థ కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు వంటి చెల్లింపుల రికార్డులను పరిశీలించి ‘ఆల్టర్నేటివ్ క్రెడిట్ స్కోరు’ను ఇస్తుంది. ఈ స్కోరు ఆధారంగా బ్యాంకులు లక్షలాది మందికి రుణాలు అందించే అవకాశం ఉందని అధికారులు Way2Newsకు తెలిపారు.