News August 31, 2024
రంగు మారుతున్న వేములవాడ ధర్మగుండం నీరు!
శ్రావణ మాసం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. నిత్యం వేలాది మంది భక్తులతో రాజన్న ఆలయం రద్దీగా మారింది. అయితే దర్శనానికి వచ్చిన భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేయడంతో నీరు మురికిగా మారాయి. నీరు పచ్చబడినట్లు భక్తులకు కనిపించడంతో స్నానాలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఆలయ అధికారులు స్పందించి పచ్చబడ్డ నీరు తొలగించాలని కోరుతున్నారు.
Similar News
News September 16, 2024
మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సురేఖ
పవిత్ర హృదయంతో కూడిన ప్రతి మనిషికి ఈ భూమి యావత్తు ప్రార్థనాస్థలమేనన్న మహమ్మద్ ప్రవక్త మాటలు స్ఫూర్తిదాయకమైనవని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవమైన మిలాద్ ఉన్ నబీ పండుగ (సెప్టెంబర్ 16) ను పురస్కరించుకుని మంత్రి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయ ప్రజల పై వుండాలని మంత్రి ఆకాంక్షించారు.
News September 15, 2024
MHBD: 6 నెలల క్రితం వివాహం.. ఉరేసుకొని ఆత్మహత్య
MHBD జిల్లా సీరోల్ మండలం మన్నెగూడెంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన వినేశ్ అనుమానాస్పద స్థితిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి గత 6 నెలల క్రితం వివాహమైంది. సమాచారం తెలుసుకున్న డోర్నకల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, భార్యాభర్తల మధ్య గొడవలే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.
News September 15, 2024
నిమజ్జనం సందర్భంగా వరంగల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
గణపతి నిమజ్జనం సందర్భంగా వరంగల్ ట్రైసిటీస్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ తెలిపారు. ఈ ఆంక్షలు సోమవారం మధ్యాహ్నం 12 నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. ఖమ్మం, ములుగు, నర్సంపేట, హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లు ఆంక్షలు తప్పక పాటించాలని తెలిపారు.