News January 25, 2025
రంగు రంగుల దీపాలతో ముస్తాబైన MHBD కలెక్టరేట్

మహబూబాబాద్లో రేపు జరిగే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్ రంగు రంగుల తోరణాలతో, జాతీయ జెండా రంగుల ప్రకాశాలతో ఆకర్షణీయంగా ముస్తాబైంది. గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లకు అధికారులు కలెక్టర్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం మొత్తం కూడా మూడు రంగుల జెండా ఆకారంలో లైట్లు ఏర్పాటు చేసి కలెక్టరేట్ను అధికారులు ముస్తాబు చేశారు.
Similar News
News October 21, 2025
పెద్దపల్లి: ‘ప్రజలకు పారదర్శక వైద్యం అందించాలి’

పెద్దపల్లి వరుణ్ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వాణిశ్రీ, రికార్డులు పరిశీలించి, సేవల నాణ్యతను సమీక్షించారు. ఫీజులు ధరల పట్టిక ప్రకారం వసూలు చేయాలని, అందించే సేవల వివరాలు రిసెప్షన్ వద్ద బోర్డుపై స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. ప్రజలకు పారదర్శక వైద్యం అందించాలన్నారు. డా. శ్రీరాములు, డా.కె.వి. సుధాకర్ రెడ్డి ఈ తనిఖీలో పాల్గొన్నారు.
News October 21, 2025
Asia cup ట్రోఫీ వివాదం.. ఏసీసీ కొత్త ప్రతిపాదన!

Asia cup ట్రోఫీని తమకు అందజేయాలని ACC చీఫ్ నఖ్వీకి <<18064371>>బీసీసీఐ మెయిల్<<>> పంపిన విషయం తెలిసిందే. దీంతో నవంబర్ తొలివారంలో ట్రోఫీ ప్రజెంటేషన్ కార్యక్రమం దుబాయ్లో నిర్వహిస్తామని ACC ప్రతిపాదన చేసింది. ‘మీరు ట్రోఫీని కోరుకుంటే.. దాన్ని ఇచ్చేందుకు వేదిక ఏర్పాటు చేస్తాం’ అని చెప్పినట్లు సమాచారం. కానీ అందుకు BCCI సుముఖంగా లేదని, ICC మీటింగ్లో దీనిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని ACC వర్గాలు చెప్పాయి.
News October 21, 2025
ప.గో: జిల్లాస్థాయి ఎంపికలో 102 మంది ఎంపిక

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఏలూరులో 2చోట్ల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14,17 జిల్లా స్థాయి ఎంపిక పోటీలను మంగళవారం నిర్వహించామని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి అలివేలుమంగ తెలిపారు. జూడో క్రీడలకు 72 మంది హాజరు కాగా 30 మంది, స్కేటింగ్ 122 కి 62 మంది, సాఫ్ట్ టెన్నిస్ 30 కి 5 గురు, స్క్వాష్ క్రీడలకు 30 కి 5 గురు ఎంపికయ్యారన్నారు.16 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.