News February 22, 2025
రంజాన్‌కు పకడ్బంది ఏర్పాట్లు చేయాలి: KMR కలెక్టర్

రానున్న రంజాన్ మాసం నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం ఎస్పీతో కలిసి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. రంజాన్ మాసం ఉపవాస దీక్షలు మార్చి 2 నుంచి ప్రారంభం కానున్న సందర్భంగా తాగునీరు, శానిటేషన్, నిరంతర విద్యుత్ సరఫరా, వీధి లైట్లు, తదితర ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
Similar News
News March 21, 2025
విశాఖ – భద్రాచలం ప్రత్యేక బస్సులు

శ్రీరామ నవమి సందర్భంగా విశాఖపట్నం నుంచి భద్రాచలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని APSRTC జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు శుక్రవారం తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీ ఉదయం 6 గంటలకు, సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయని ఆయన తెలిపారు. భక్తుల కోరిక మేరకు ద్వారకా బస్ స్టేషన్ కాంప్లెక్స్ నుంచి రాజమండ్రి మీదుగా నడుపుతున్నట్లు తెలిపారు.
News March 21, 2025
GREAT:TG ఖోఖో జట్టుకు ఎంపికైన అక్కాచెల్లెలు

ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ క్రీడలకు ఉమ్మడి పాలమూరు జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన గోపాలం, వెంకటమ్మ దంపతుల నలుగురు కూతుర్లు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టుకు అక్కాచెల్లెలు రూప(PD), దీప(SGT), శిల్ప(వెటర్నరీ అసిస్టెంట్), పుష్ప(PET) ఎంపికయ్యారు. నేటి నుంచి ఈనెల 24 వరకు ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో వీరు పాల్గొంటారు. CONGRATULATIONS
News March 21, 2025
కొడంగల్: శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. సీఎంకు ఆహ్వానం

పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి 45వ వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ సందర్భంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని ఆలయ ధర్మకర్తలు మర్యాద పూర్వకంగా కలసి శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించి రావాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు నందరం శ్రీనివాస్, నందరం రాజేందర్, నందరం రత్నం, నందరం ప్రశాంత్, నందరం ఓంప్రకాశ్ తదితరులు ఉన్నారు.