News February 26, 2025
రంజాన్ ప్రశాంతంగా జరుపుకోవాలి: ASF కలెక్టర్

రంజాన్ పండుగను ప్రశాంత వాతావరణంలో సామరస్యంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు ఎస్పీ, ముస్లిం మత పెద్దలు, మస్జిద్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. పవిత్రమైన రంజాన్ మాసాన్ని ప్రశాంత వాతావరణంలో అందరూ పవిత్రంగా జరుపుకోవాలన్నారు. జిల్లాలో ప్రతి మస్జిద్ దగ్గర పారిశుద్ధ్య పనులు చేపట్టాలని తెలిపారు.
Similar News
News October 30, 2025
నిర్మల్: నవంబర్ 4న జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు

నవంబర్ 4 నుంచి జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించనున్నారు. జానపద నృత్యం, పాటలు(బృందం) కవిత్వం, వ్యాసరచన, ఉపన్యాసం (హిందీ,ఇంగ్లీష్,తెలుగు) పెయింటింగ్, ఇన్నోవేషన్ ట్రాక్, తదితర అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. నవంబర్ 4న 15 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల వారు తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల సోఫీ నగర్లో హాజరు కావాలని సూచించారు. ప్రథమ స్థానంలో నిలిచినవారిని రాష్ట్రస్థాయికి పంపనున్నారు.
News October 30, 2025
TU: గెస్ట్ ఫ్యాకల్టీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

తెలంగాణ విశ్వవిద్యాలయంలోని లా కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా చేరడానికి నియామక చేపట్టినట్లు లా కళాశాల ప్రిన్సిపల్ ప్రసన్నరాణి తెలిపారు. LLM/ML లేదా సరిసమాన విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. నవంబర్ 1న మధ్యాహ్నం 2 గంటలకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా కాలేజీలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్లో సందర్శించాలన్నారు.
News October 30, 2025
కాగజ్నగర్: సైబర్ నేరగాడి అరెస్ట్

కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆన్ లైన్ ద్వారా రూ.45790 పోగొట్టుకొని ఫిర్యాదు చేసినట్లు CI కుమారస్వామి తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు D-4C బృందం ద్వారా సాంకేతిక ఆధారాలను సేకరించి MPకి చెందిన ఆశిష్ కుమార్ దోహార్ను పట్టకున్నారు. అతడి ఖాతాలోని రూ.34537.38 ఫ్రీజ్ చేసినట్లు CI వెల్లడించారు.


