News March 31, 2025
రంజాన్.. HYDలో వీటికి ఫుల్ DEMAND

HYD నగరంలో రంజాన్ పండుగ వేళ బిర్యానీ, క్యాబ్స్, బుకింగ్ ఆటోలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పండగ కావడంతో రెడ్ హిల్స్ లాంటి అనేక ప్రాంతాల్లో ముస్లిం ఆటో డ్రైవర్లు సెలవు తీసుకున్నారు. మరోవైపు పండగ వేళ నగరంలో రద్దీగా ఉండడంతో సాధారణ రోజులతో పోలిస్తే బుకింగ్ ఆటోలకు 20 నుంచి 30 శాతం అధికంగా చార్జీలు పడుతున్నట్లు ప్రయాణికులు తెలిపారు. ఆన్లైన్ ఆర్డర్లతో రెస్టారెంట్లు, హోటల్స్ కిక్కిరిస్తున్నాయి.
Similar News
News April 4, 2025
ట్రాక్టర్లకు జీపీఎస్ ఖచ్చితంగా ఉండాలి: జనగాం కలెక్టర్

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక తరలింపులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ట్రాక్టర్లకు జీపీఎస్ ఖచ్చితంగా ఉండాలని ఆదేశించారు. ఏ గ్రామానికి ఇసుకను తరలిస్తున్నారో ఆ రాకపోకలకు సంబంధించి గ్రామ పంచాయతీ కార్యాలయంలోని రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.
News April 4, 2025
సిద్దిపేట: ‘సమగ్ర ప్రణాళికతో వరి కొనుగోళ్లు జరపాలి’

యాసంగి 2024-25 సంబంధించిన వరి ధాన్యం సేకరణ ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా సాఫీగా నిర్వహించేందుకు గాను సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్ ఆదేశించారు. జిల్లాలోని వరిధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వహకులకు, మండల వ్యవసాయ & వ్యవసాయ విస్తరణ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
News April 4, 2025
తిర్యాణి: యాక్సిడెంట్.. యువకుడి దుర్మరణం

నార్నూర్ మండలం గంగాపూర్లో ఎంగేజ్మెంట్కి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో పుసిగూడ ఘాట్ వద్ద జరిగిన యాక్సిడెంట్లో యువకుడు దుర్మరణం చెందారు. యువకుడిని ఆటోలో ఉట్నూర్ ఆసుపత్రికి తరలించగా మృతిచెందారు. మృతుడు తొడసం జంగుగా గుర్తించారు. తిర్యాణి మండలం సుంగాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడికి భార్య పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.