News April 14, 2025

రంపచోడవరంలో నేడు గ్రీవెన్స్ రద్దు

image

రంపచోడవరంలో సోమవారం నిర్వహించవలసిన గ్రీవెన్స్‌ని రద్దు చేశామని ITDA. PO. సింహాచలం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా అన్ని ప్రభుత్వం కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. దీంతో గ్రీవెన్స్ రద్దు అయ్యిందని తెలిపారు. రంపచోడవరం డివిజన్‌లో ప్రజలంతా ఈ విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు.

Similar News

News September 16, 2025

చిత్తూరు DCMS ఛైర్మన్ మృతి

image

చిత్తూరు డీసీఎం ఛైర్మన్, టీడీపీ చంద్రగిరి మండల అధ్యక్షుడు పల్లిమేమి సుబ్రహ్మణ్యం నాయుడు మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నెల రోజులుగా చికిత్స పొందుతున్నారు. కోలుకోలేక తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు టీడీపీ నాయకులు సంతాపం తెలిపారు.

News September 16, 2025

గోపాలపట్నంలో దారుణ హత్య

image

గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లపువానిపాలెం 89వ వార్డులో దారుణం జరిగింది. అలమండ నితీశ్ (23) అనే వ్యక్తి భీశెట్టి పరదేశి (75)పై బండరాయితో దాడి చేసి హత్య చేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికులను కూడా బెదిరించాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 16, 2025

పోషకాహారంతో ఆరోగ్యకర జీవనం: ములుగు కలెక్టర్

image

పోషకాహారంతో ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. 8వ రాష్ట్రీయ పోషణ్‌లో భాగంగా నెల రోజులు నిర్వహించే కార్యక్రమాలపై ఐసీడీఎస్, హెల్త్, విద్య, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలని, పోషకాహారంపై అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణులు, చిన్నారులకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణీ చేయాలన్నారు.