News April 14, 2025

రంపచోడవరంలో నేడు గ్రీవెన్స్ రద్దు

image

రంపచోడవరంలో సోమవారం నిర్వహించవలసిన గ్రీవెన్స్‌ని రద్దు చేశామని ITDA. PO. సింహాచలం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా అన్ని ప్రభుత్వం కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. దీంతో గ్రీవెన్స్ రద్దు అయ్యిందని తెలిపారు. రంపచోడవరం డివిజన్‌లో ప్రజలంతా ఈ విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు.

Similar News

News April 18, 2025

బాపులపాడు: మార్కెట్‌కి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరి మృతి

image

బాపులపాడు మండలం వేలేరు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేలేరు వద్ద కారు ఢీ కొనడంతో బైక్‌పై వెళ్తున్న బాబు అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇతను తేలప్రోలులో పట్టుగూళ్ల రీలింగ్ యూనిట్‌ని నిర్వహిస్తుంటాడు. పట్టుగూళ్ల కోసం హనుమాన్ జంక్షన్ మార్కెట్‌కు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

News April 18, 2025

ఇందిరమ్మ ప్రభుత్వాన్ని పడగొడతారా?: మంత్రి

image

TG: ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొడతామంటూ KCR అనుచరులు పగటి కలలు కంటున్నారని మంత్రి పొంగులేటి ఫైరయ్యారు. సంతలో కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనాలనుకుంటున్నారని, కానీ అది జరగదని స్పష్టం చేశారు. ములుగు(D) వెంకటాపూర్‌లో రెవెన్యూ సదస్సులో మంత్రి సీతక్కతో కలిసి పాల్గొన్న పొంగులేటి.. పేదల కన్నీటిని తుడిచేందుకే భూ భారతి తీసుకొచ్చామన్నారు. గతంలో ధరణి గురించి రెవెన్యూ సదస్సులు ఎక్కడైనా పెట్టారా? అని ప్రశ్నించారు.

News April 18, 2025

TTD ఛైర్మన్‌ను బర్తరఫ్ చేయాలి: సుబ్రహ్మణ్యస్వామి

image

AP: గోశాలలో గోవుల మరణంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి విమర్శించారు. సీఎం చంద్రబాబు ఛైర్మన్‌ను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘టీటీడీ పాలన అధ్వానంగా ఉంది. గోవుల మరణం వెనుక కుట్ర ఉంది. టీటీడీ వ్యాపార ధోరణి వల్లే ఈ దారుణం జరిగింది. వయసు పెరిగి గోవులు చనిపోయాయంటున్నారు. మీరు చనిపోతే కూడా మిమ్మల్ని వదిలేయాలా?’ అని ఆయన ఫైర్ అయ్యారు.

error: Content is protected !!