News June 17, 2024

రంపచోడవరం: గుండె పోటుతో ఉద్యోగి మృతి

image

రంపచోడవరం నియోజకవర్గం చింతూరులో ఓ సంస్థ డివిజనల్ మేనేజర్‌గా పని చేస్తున్న చింతా మధు(52) ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడని సంస్థ సిబ్బంది తెలిపారు. విశాఖలో ఆయన నివాసం ఉంటున్న ఇంట్లోనే కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Similar News

News October 3, 2024

నిడదవోలులో రేపు జాబ్ మేళా

image

నిడదవోలు ఎస్వీఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తూ.గో.జిల్లా ఉపాధి కల్పనాధికారి సుధాకర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు జాబ్ మేళా మొదలవుతుందని, 5 కంపెనీల ప్రతినిధులు ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. SSC, డిప్లొమా, డీఫార్మసీ, ఇంటర్, డిగ్రీ, బీ-ఫార్మసీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంబీఏ, ఎంసీఏ ఎం-ఫార్మసీ చదివిన 19-30 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు అర్హులన్నారు.

News October 3, 2024

రాజోలు: రోడ్డు ప్రమాదంలో హైస్కూల్ హెడ్ మాస్టర్ మృతి

image

సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం గ్రామంలో వెలంకాయల కాలవగట్టు ప్రాంతానికి చెందిన సుజాత కేశదాసుపాలెం హైస్కూల్లో హెడ్ మాస్టర్‌గా విధులను నిర్వర్తిస్తున్నారు. డ్యూటీ నిమిత్తం ఆమె స్కూటీపై వెళ్తూండగా గొయ్యిని తప్పించే ప్రయత్నంలో పడిపోవడంతో తలకు బలమైన గాయాలు అయ్యాయి. కాకినాడ అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల పలువురు ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.

News October 3, 2024

రోజా గారూ.. అప్పుడు ఏమైంది: వాసంశెట్టి

image

అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ మంత్రి రోజా ట్వీట్ చేయగా..దీనికి కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ కౌంటర్ ఇచ్చారు. ‘రోజా గారూ మీరు మంచి మనసుతో ఇలా స్పందించడం చాలా ఆనందం. కానీ ఆరోజు రాజకీయాలకు సంబంధంలేని లోకేశ్ తల్లి భువనేశ్వరిని నిండు సభలో YCP నేతలు అవమానించినప్పుడు పకపక నవ్వారు కదా అప్పుడు ఏమైంది మీ స్పందన?’అని వాసంశెట్టి ట్వీట్ చేశారు.