News February 25, 2025

రంపచోడవరం: ‘జాగ్రత్తలు తీసుకుని చికెన్ అమ్ముకోవచ్చు’

image

కొన్ని జాగ్రత్తలు తీసుకుని చికెన్, గుడ్ల అమ్మకాలు మంగళవారం నుంచి చేసుకోవచ్చని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. చికెన్ షాపుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహించుకోవాలన్నారు. పరిశుభ్రత పాటించాలన్నారు. కోళ్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు షాపు ఓనర్లు పర్యవేక్షించాలన్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాపించిన ప్రాంతాల నుంచి కోళ్లను తరలించవద్దన్నారు.

Similar News

News December 8, 2025

KMR: స్థానిక పోరులో కొత్త ట్రెండ్

image

కామారెడ్డి జిల్లాలో సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు వినూత్న వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు.. ఎన్నో ఏండ్లుగా తగాదాల కారణంగా దూరమైన ఓటర్ల వద్దకు నేరుగా వెళ్తున్నారు. పాత విభేదాలు, ఘర్షణలను పక్కన పెట్టి, ‘క్షమించండి’ అంటూ చేతులు జోడిస్తున్నారు. ఈ భావోద్వేగపూరిత ప్రచారం ఓటర్లపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

News December 8, 2025

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

సోమవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల,డివిజన్ కేంద్రాలు,మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా,ఆన్‌లైన్‌లో meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చన్నారు. అర్జీ పరిష్కార స్థితి గురించి తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌లోనూ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చున్నారు.