News October 7, 2024

రంపచోడవరం: CRPF జవాన్ మృతి

image

చింతూరు మండలంలో విషాదం జరిగింది. వేటగాళ్లు పెట్టిన విద్యుత్ వైర్లు తగలడంతో సీఆర్పీఎఫ్ జవాను తిరువాల కారాసు (55) ఆదివారం రాత్రి మృతిచెందాడు. వివరాలు.. డొంకరాయి పరిసరాల్లో రాత్రి 2 గంటలకు కూంబింగ్ విధులు నిర్వర్తిస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 9, 2024

తూ.గో: పవన్ కళ్యాణ్‌కు తమ్మల రామస్వామి‌ కృతజ్ఞతలు

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాకినాడ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తుమ్మల రామస్వామి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం తనను కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఛైర్మన్‌గా నియమించినట్లు సమాచారం అందుకున్న తుమ్మల రామస్వామి (బాబు) హుటాహుటిన మంగళగిరి వెళ్లారు. అక్కడ జనసేన కార్యాలయంలో పార్టీ అధినేత పవన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలిపారు.

News November 9, 2024

కూటమి ప్రభుత్వంలో తూ.గో జిల్లా నేతలకు కీలక పదవులు

image

సీఎం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల రెండో లిస్టులో తూ.గో జిల్లా నేతలకు పదవులు వరించాయి. రాజమండ్రికి చెందిన కూడిపూడి సత్తిబాబుకు ఏపీ శెట్టి బలిజ వెల్ఫేల్& డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, స్వామినాయుడు అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్, తుమ్మల రామస్వామి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా, బొడ్డు వెంకట రమణ చౌదరి రాజమండ్రి అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

News November 9, 2024

కాకినాడ: బాలికలకు అశ్లీల వీడియోలు చూపిన టీచర్ సస్పెండ్

image

కాకినాడలోని తూరంగి ZP పాఠశాల ఇంగ్లిష్ టీచర్ వలీబాబాను శుక్రవారం సస్పెండ్ చేశారు. అధికారుల కథనం.. SEP 28న స్కూళ్లో బాలికలకు అశ్లీల వీడియోలు చూపి, అసభ్యంగా ప్రవర్తిండాని వారు HMకు కంప్లైంట్ చేశారు. దీనిపై డీవైఈవో సత్యనారయణ, జీసీడీవో రమాదేవి విచారణ చేయగా, అతనిపై ఆరోపణలు వాస్తవమేనని తేల్చారు. దీంతో అతనిపై గురువారం పోక్సో కేసు నమోదు చేయగా, శుక్రవారం సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.