News April 5, 2025

రంప: చెరువులో జారిపడి వ్యక్తి మృతి

image

రంపచోడవరం మండలం పెద్దకొండకి చెందిన పి.బాబురావు (46) అదే గ్రామం శివారున ఉన్న చెరువులో జారిపడి మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కాలకృత్యాలు తీర్చుకోవడానికి చెరువులోకి దిగి, అదుపు తప్పి లోపలికి పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న కుటుంబ సభ్యులు రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందాడని ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 17, 2025

మత్స్యశాఖ ఇంచార్జి అధికారిగా కె. డోలిసింగ్

image

కామారెడ్డి నూతన జిల్లా మత్స్య శాఖ ఇంచార్జి అధికారిగా కె. డోలిసింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
ఇంతకు ముందు ఈ పదవిలో ఉన్న శ్రీపతి వరంగల్, హన్మకొండ జిల్లాలకు వర్క్ డిప్యూటేషన్‌పై బదిలీ అయ్యారు.

బుట్టాయగూడెం: పదో తరగతి పరీక్షా కేంద్రం తనిఖీ

image

బుట్టాయగూడెం జడ్పీ హైస్కూల్ ప్లస్‌ను ఏలూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆర్. ఆశాలత సోమవారం సందర్శించారు. రాబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్ర ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. విద్యార్థులకు కూర్చునే ఏర్పాట్లు, గాలి, వెలుతురు, తాగునీటి సౌకర్యం, సీసీటీవీ అమరికలతో పాటు ఇతర ప్రమాణాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.