News March 15, 2025

రంప : పడిపోయిన టమాటా ధర

image

ఆరుగాలాలు కష్టపడి పంట పండించిన రైతుకు తన కష్టానికి తగిన మద్దతు ధర కూడా రాని పరిస్థితి నేడు నెలకొంది. అల్లూరి జిల్లాలో టమాటా రేటు బాగా పడిపోయింది. రంపచోడవరం పరిసర గ్రామాల్లో శనివారం హోల్ సేల్ మార్కెట్లో 10 కిలోలు టమాటా రూ. 100 పలికింది. రిటైల్ గా రూ.150 మాత్రమే పలికింది. ఈ సీజన్ దిగుబడి పెరిగి ఒకే సారి పంట మార్కెట్టుకు రావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు అంటున్నారు.

Similar News

News December 23, 2025

VJA: రైల్వే మ్యాప్‌లో రాయనపాడు సరికొత్త ముద్ర

image

రాయనపాడు రైల్వేస్టేషన్ సరికొత్త హంగులతో ముస్తాబవుతోంది. అమృత్ భారత్ పథకంలో భాగంగా, HYDలోని చర్లపల్లి స్టేషన్ తరహాలో దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే 80% పునర్నిర్మాణ పనులు పూర్తికాగా, అత్యాధునిక వసతులతో ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచనుంది. వచ్చే ఏడాదికి ఈ స్టేషన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుండటంతో, విజయవాడ స్టేషన్‌పై ఒత్తిడి తగ్గడమే కాకుండా ప్రయాణికులకు వేగవంతమైన సేవలు అందనున్నాయి.

News December 23, 2025

శ్రీకాకుళం: ‘రూ.80 వేలు కడతావా.. అరెస్ట్ అవుతావా’

image

డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ యువకుడు వద్ద సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచేసిన ఘటన పాతపట్నంలో చేటుచేసుకుంది. నరసింహానగర్-2లో నివాసముంటున్న వెంకట భీష్మ నేతజీకి ఓ నంబర్ నుంచి సెప్టెంబర్ 23న ఫోన్ చేసి మీరు డిజిటల్ ఆరెస్ట్ అయ్యారని రూ.80 వేలు చెల్లిస్తారా, అరెస్ట్ అవుతారా అని బెదిరించారు. అతడు బయపడి రూ.80వేలు చెల్లించాడు. మోసపోయానని తెలుసుకున్న అతడు సోమవారం సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్‌ 1930 ఫిర్యాదు చేశాడు.

News December 23, 2025

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు రానున్న భారీ పరిశ్రమ

image

సౌర విద్యుత్ ఉత్పత్తి భారీ పరిశ్రమ ఏర్పాటుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని బల్లికురవ, సంతమాగులూరు మండలాలో 1,591.17 ఎకరాల భూమిని సేకరించాలని కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం అధికారులను ఆదేశించారు. ఈ పరిశ్రమకు కేటాయించే భూసేకరణకు నిధులు విడుదలయ్యాయన్నారు. వేగంగా భూసేకరణ చేపట్టాలన్నారు. 2 వారాలలో సమగ్ర నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూమి ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.