News October 2, 2024
రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలి: కలెక్టర్
ప్రతి ఒక్కరూ మానవుడిగా పుట్టినందుకు రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్నారు. జాతీయ స్వచ్ఛంద దాతల దినోత్సవం సందర్భంగా.. ప్రభుత్వ రక్తనిధి కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం, మంగళవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ముఖ్య అతిధిగా కలెక్టర్ పాల్గొన్నారు.
Similar News
News October 15, 2024
మాజీ ఎమ్మెల్యేకు మూడు వైన్ షాపులు
ఉమ్మడి కడప జిల్లాలో వైన్ షాపుల లాటరీ ప్రక్రియ ఆసక్తికరంగా నడిచింది. పలు చోట్ల మహిళలు సైతం షాపులను దక్కించుకున్నారు. మరోవైపు లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే గండికోట ద్వారకనాథ్ రెడ్డి తన కుటుంబ సభ్యుల పేరిట అప్లికేషన్ వేయగా.. లాటరీలో మూడు షాపులు తగిలాయి. లక్కిరెడ్డిపల్లె, రామాపురం, గాలివీడు మండలాల్లోని షాపులను ఆయన కైవసం చేసుకున్నారు.
News October 15, 2024
తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కడప కలెక్టర్
రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను కారణంగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని రెవెన్యూ డివిజన్ల వారీగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
News October 14, 2024
వైవీయూ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ రాజీనామా ఆమోదం
యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆచార్యులు తప్పెట రామ ప్రసాద్ రెడ్డి ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా విధుల నుంచి రిలీవ్ చేయాలని ఉపకులపతిని కొద్దిరోజుల కిందట కలిసి కోరారు. ఆయన విజ్ఞాపన మేరకు విధుల నుంచి రిలీవ్ చేసినట్టు వైవీయూ ఉపకులపతి ఆచార్య కె. కృష్ణారెడ్డి వెల్లడించారు.