News October 29, 2024

రక్తదానం మరొకరికి ప్రాణదానం: రూరల్ డీఎస్పీ

image

పొదలకూరు రక్తాన్ని కృత్రిమంగా సృష్టించలేమని, అందుకే రక్తదానం ప్రాణదానంతో సమానం నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. స్థానిక సీఐ రాంబాబు, ఎస్ఐ హనీఫ్, సీ.హెచ్.సీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసాద్, డాక్టర్ నజ్మా సుల్తానాతో కలిసి ఆయన ప్రారంభించారు.

Similar News

News October 30, 2024

నెల్లూరు జిల్లాలోని ఓటర్ల సంఖ్య ఇదే.!

image

ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో మొత్తం 19,44,157మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 9,51,122.. మహిళలు 9,92,825.. థర్డ్ జెండర్ 210 మంది ఉన్నారు. నవంబరులో అభ్యంతరాలు స్వీకరించి.. వచ్చే ఏడాది 6న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనుంది.

News October 30, 2024

నెల్లూరు: దేవాలయాలకు నెయ్యి సరఫరాపై ఉన్నత స్థాయి కమిటీ

image

రాష్ట్రంలోని దేవాలయాల్లో ప్రసాదాల తయారీ, ఇతరత్రా అవసరాల కోసం వినియోగించే నెయ్యిని సేకరించే విషయంలో అనుసరించాల్సిన విధి విధానాల్లో మార్పులను సూచించడానికి ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని నియమిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. మంగళవారం దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో వివిధ డైరీల సంఘాలు, సంస్థ ప్రతినిధులతో చర్చించారు.